సుధీర్‌తో ఆగింది.. హనుతో మొదలవుతోంది

సుధీర్‌తో ఆగింది.. హనుతో మొదలవుతోంది

‘మహానుభావుడు’ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు శర్వానంద్. దీని తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నాడు శర్వా. ‘కేశవ’తో మళ్లీ ఫామ్ అందుకున్న సుధీర్.. శర్వా కోసం ఒక స్పెషల్ స్టోరీ రెడీ చేశాడని.. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఈ సినిమా మొదలుపెట్టడానికి రంగం సిద్ధమైందని అన్నారు. ఇద్దరు హీరోయిన్లు కూడా ఫైనలైజ్ అయినట్లు వార్తలొచ్చాయి. కానీ ఏమైందో ఏమో ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. స్క్రిప్టు విషయంలో సమస్యలని.. ప్రి ప్రొడక్షన్ ఆలస్యమవుతోందని.. ఏవేవో ఊహాగానాలు వినిపిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కానున్న మాట మాత్రం వాస్తవం అని చెబుతున్నారు.

ఐతే శర్వా ఆ సినిమా మొదలయ్యే వరకు ఖాళీగా ఏమీ ఉండిపోవట్లేదు. ఈ గ్యాప్‌లో ఓ సినిమా మొదలుపెట్టేస్తున్నాడు. కొన్ని నెలల కిందటే ‘లై’ సినిమాతో పలకరించిన హను రాఘవపూడి దర్శకత్వంలో అతను సినిమా మొదలుపెడుతున్నాడు. ‘లక్ష్మీ నరసింహా ఫిలిమ్స్’ అనే కొత్త బేనర్ మీద ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులోనూ ఇద్దరు కథానాయికలు నటిస్తారట. సుధీర్ సినిమా కంటే ముందు ప్రకాష్ కోవెలమూడితోనూ శర్వా ఓ సినిమా ఓకే చేశాడు. అది కూడా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఐతే సుధీర్ సినిమాకు మాత్రం బ్రేక్ తాత్కాలికమే అని.. కొన్ని నెలల తర్వాత ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లడం పక్కా అని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు