'బాహుబలి' రికార్డులు ఔటే!

 'బాహుబలి' రికార్డులు ఔటే!

రాజమౌళితో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల మల్టీస్టారర్‌ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ వెనక సర్వం సిద్ధమైపోతోంది. ఈ చిత్రం గురించి త్వరలోనే గ్రాండ్‌ అనౌన్స్‌మెంట్‌ ఇవ్వడానికి రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నాడట. ఇప్పటికే ఇద్దరు హీరోల డేట్స్‌ ఎప్పట్నుంచి ఎప్పటివరకు కావాలనేది రాజమౌళి స్పష్టం చేసాడట. రాజమౌళి సినిమా అనగానే రాజులు, కత్తి యుద్ధాలు అని భావించవచ్చు.

కానీ ఇది ఫక్తు కమర్షియల్‌ సినిమా అని, పూర్తి స్థాయి మాస్‌ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నాడని సమాచారం. నందమూరి, చిరంజీవి కుటుంబాల హీరోలతో సినిమా తీయాలని దశాబ్ధాలుగా ప్రయత్నం జరిగినా కానీ రాజమౌళి వల్లే సాధ్యమవుతోంది. ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే ఇక అది ఎలా వుంటుందనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సగటు కమర్షియల్‌ చిత్రాలకి అయ్యే బడ్జెట్‌కి రెండింతలు పెట్టబోతున్నారని, ఈ చిత్రం మాస్‌ చిత్రాల్లోనే తలమానికంగా వుంటుందని చెప్పుకుంటున్నారు.

రాజమౌళికి మాస్‌ పల్స్‌ ఎంత బాగా తెలుసనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం బాహుబలి 2 రికార్డులని తెలుగు రాష్ట్రాల వరకు తుడిచిపెట్టేయగలదని అంచనాలు సాగుతున్నాయంటే క్రేజ్‌ ఏ లెవల్లో వుందనేది అర్థం చేసుకోండిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు