ఎన్టీఆర్‌ పక్కన బలంగా సెట్‌ చేసిన త్రివిక్రమ్‌

ఎన్టీఆర్‌ పక్కన బలంగా సెట్‌ చేసిన త్రివిక్రమ్‌

ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ సినిమా అంటే మాస్‌గా వుంటుందా, క్లాస్‌గా వుంటుందా అనే డౌట్స్‌ అక్కర్లేదు. ఇది ఫక్తు త్రివిక్రమ్‌ మార్కు ఫ్యామిలీ ఎంటర్‌టైనరేనట. తన ఇమేజ్‌ కోసం కథ రాయకుండా, తన స్టయిల్లోనే సినిమా తీయమని ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా కోరడంతో త్రివిక్రమ్‌ 'నువ్వు నాకు నచ్చావ్‌' లాంటి ఒక మంచి ఎంటర్‌టైనర్‌ని రాసి పెట్టాడట.

పవన్‌తో సినిమా అయిపోగానే ఎన్టీఆర్‌ చిత్రం పట్టాలెక్కుతుంది. వచ్చే ఏడాది దసరాకి సినిమా రిలీజ్‌ అయిపోతుందని ప్రస్తుతానికి టాక్‌ నడుస్తోంది. ఇదిలావుంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పక్కన ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో సునీల్‌ కనిపిస్తాడట. కామెడీ వేషాలు కట్టి పెట్టి హీరోగా మారిన సునీల్‌ ఆ తర్వాత తన స్నేహితుడు త్రివిక్రమ్‌ కోసం కూడా ఎప్పుడూ ఒక చిన్న వేషం వేసి ఎరుగడు. అయితే ప్రస్తుతం హీరోగా హిట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సునీల్‌కి మళ్లీ కమెడియన్‌గా వచ్చి తన సత్తా చాటుకోవాలని ఉబలాటంగా వుంది.

అందుకే తన స్నేహితుడు త్రివిక్రమ్‌కే రిక్వెస్ట్‌ పెట్టగా, సునీల్‌ కోసమే త్రివిక్రమ్‌ ఒక క్యారెక్టర్‌ రాసాడట. ఇందులో ఎన్టీఆర్‌ పక్కనే వుంటూ తన మార్కు సెటైర్లు వేస్తూ సునీల్‌ విపరీతంగా నవ్వించబోతున్నాడని టాక్‌. ఎన్టీఆర్‌ పక్కన ఇంత సీజన్డ్‌ కమెడియన్‌ సెట్‌ అయ్యాడంటే ఇక ఆ సినిమాలో నవ్వులకి లోటేమి వుంటుంది చెప్పండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు