కత్రినా పక్కన బ్రహ్మోత్సవం స్టెప్పులు

కత్రినా పక్కన బ్రహ్మోత్సవం స్టెప్పులు

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ డ్యాన్స్ అంటే జనాలు వెర్రెత్తిపోతారని అనడంలో సందేహం లేదు. మన దగ్గర మల్లీశ్వరి సినిమా చేసే నాటికి ఈమెకు అంతగా డ్యాన్స్ రాకపోయినా.. బాలీవుడ్ కి చేరుకున్న తర్వాత.. ఈ విషయంలో బాగా ఆరితేరిపోయింది. చిక్నీ చమేలీ నుంచి రీసెంట్ గా కాలా చష్మా వరకూ కేట్ డ్యాన్సులకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేశారు.

ఇప్పుడీ భామ సల్మాన్ ఖాన్ కి జోడీగా నటించిన టైగర్ జిందా హై మూవీ నుంచి.. 'స్వాగ్ సే స్వాగత్' వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. బీట్ అదిరిపోయింది.. సల్మాన్ స్టైలింగ్ అదుర్స్.. కేట్ స్టెప్పులు అయితే ఇరగదీసేసిందంతే. కానీ ఇదే పాటలో సల్మాన్ ఖాన్ స్టెప్స్ చూస్తే బాలీవుడ్ జనాలకు మామూలుగానే ఉండొచ్చు కానీ.. టాలీవుడ్ జనాలకు ఆశ్చర్యం వేయడం ఖాయం. గతేడాది బ్రహ్మోత్సవం మూవీలో మహేష్ బాబు ఇలాంటి డ్యాన్సులే వేసినపుడు అందరూ తెగ వెక్కిరించేశారు. డ్యాన్సులు రాకపోతే వేయడం మానేయాలి కానీ.. మరీ ఇలా ప్యాంట్ లో చీమలు దూరినట్లు దులుపుకోవడం ఏంటంటూ వెటకారాలు ఆడారు.

ఇప్పుడు సల్లూ భాయ్ వేసిన స్టెప్స్.. బ్రహ్మోత్సవం స్టెప్పులకు ఏమాత్రం తీసిపోవు. పైగా సల్మాన్ ప్యాంట్ పాకెట్ కూడా బయటకు తీసి చూపించాడు. విచిత్రం ఏంటంటే.. చాలామంది టాలీవుడ్ ఫ్యాన్స్ సల్మాన్ స్టెప్పులు అదుర్స్ అనేస్తున్నారు. అలాంటివే మహేష్ చేస్తేనేమో కామెడీలు చేసిన వారు కూడా.. సల్మాన్ చేస్తే కేక అనడం ఆశ్చర్యకరం. అయినా టైగర్ జిందా హై సాంగ్ లో.. కత్రినా పక్కన బ్రహ్మోత్సవం స్టెప్పులు చూడడం కాసింత ఇబ్బందిగానే అనిపించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English