హీరోయిన్లను క్యాస్ట్ అడగరేం!?

హీరోయిన్లను క్యాస్ట్ అడగరేం!?

నంది అవార్డులు.. ఇప్పుడు టాలీవుడ్ లో అతి పెద్ద వివాదంగా మారిపోయింది. అవార్డులు ప్రకటించేంత వరకూ పెద్దగా విబేధాలు కనిపించని తెలుగు సినీ పరిశ్రమలో.. ఈ నందులు అంతరాలను సృష్టించాయి. నిన్నటికి నిన్న పోసాని కృష్ణమురళి చెరిగిన నిప్పులను ఇప్పట్లో ఎవరూ మర్చిపోలేరు. అయితే.. ఈ వివాదం అంతా కులాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే.

ఆయా హీరోలకు.. ఇతర టెక్నీషియన్స్ కు కులాల ఆధారంగా అవార్డులు ఇచ్చారన్నది చాలా మంది మాట్లాడుతున్న సారాంశం. మరి హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి ఇలాంటి పాయింట్స్ పట్టవా అన్నవా అనే ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. 2014కు గాను గీతాంజలి చిత్రంలో అంజలికి ఉత్తమ నటి అవార్డ్ దక్కింది. 2015లో సైజ్ జీరోకి గాను అనుష్కకు బెస్ట్ యాక్ట్రెస్ ప్రకటించారు. 2016లో పెళ్లి చూపులు ముూవీకి రీతు వర్మకు ఇదే పురస్కారం దక్కింది. కానీ అదే సంవత్సరాలకు బెస్ట్ మూవీస్.. బెస్ట్ యాక్టర్స్ విషయంలో జరుగుతున్నంత రచ్చ.. హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి కనిపించడం లేదు.

2016లో ఆ..ఆ ముూవీలో సమంత ఏ స్థాయిలో నటన కనబరిచిందో చూశాం. ఆ చిత్రం వచ్చేనాటికి సామ్ క్రిస్టియన్ అనే సంగతి తెలిసిందే. నాన్నకు ప్రేమతో మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ నటనను తక్కువ కట్టలేం. ఈమె పంజాబీ సిఖ్ కుటుంబానికి చెందిన వ్యక్తి. అనుష్క అంటే శెట్టి అమ్మాయి అనే సంగతి కూడా మనకు తెలుసు. మనంలో సమంత.. రేసుగుర్రంలో శృతిహాసన్.. లాంటి ఎగ్జాంపుల్స్ చాలానే కనిపిస్తాయి. కానీ అవార్డులు విషయంలో హీరోలు-కులాలపై జరుగుతున్న రచ్చ ప్లస్ చర్చ.. హీరోయిన్స్ కులాల గురించి ఎందుకు జరగడం లేదో?

దీనిని మరోవైపు నుండి చూస్తే.. అసలు  హీరోయిన్ల విషయంలో లేను కుల చర్చ.. హీరోల విషయంలో ఎందుకు వస్తోంది? నంది అవార్డులూ.. జ్యూరీ మెంబర్లే కాదు.. జనాలు కూడా ఆలోచనాసరళిని మార్చుకోవాలి.. చూడండి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు