సడన్ గా అంత ప్రేమేంటి జగపతి?

సడన్ గా అంత ప్రేమేంటి జగపతి?

ఫ్యామిలీ హీరో ఇమేజ్ నుంచి టాప్ రేంజ్ విలన్ గా మారిపోయాడు జగపతి బాబు. నిన్న విజయవాడలో కాసేపు ఉద్రిక్త పరిస్థితికి కూడా కారణం అయ్యాడు. బెజవాడ వన్ టౌన్ లో పాదయాత్ర చేసేందుకు ఈ హీరో కం విలన్ పర్మిషన్ అడిగితే.. పోలీసులు నిరాకరించారు. ఏపీ కి స్పెషల్ స్టేటస్ డిమాండ్ తో ఈ పాదయాత్ర ఉంటుదని భావించడమే ఇందుకు కారణంగా చెప్పచ్చు.

అయితే.. జగపతి బాబు మాత్రం పాదయాత్ర చేయాలనే ఫిక్స్ అయ్యాడు. మరోవైపు తమ అభిమాన నటుడు వచ్చాడనే న్యూస్ అందడంతో.. చాలామంది ఫాలోయర్స్ వచ్చారు. కొన్ని కండిషన్స్ తో పాదయాత్రకు అనుమతి లభించగా.. వన్ టౌన్ లో పాదయాత్ర చేసిన తర్వాత.. తను చిన్న సినిమాలకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరేందుకే ఇలా పాదయాత్ర చేసినట్లు చెప్పాడు జగపతి బాబు. సడెన్ గా ఈ హీరోకు ఇంతటి ప్రేమ ఎందుకు వచ్చిందనే విషయం చెప్పలేం కానీ.. రీసెంట్ గా విశాఖ ఆర్కే బీచ్ లో కూడా పాదయాత్ర చేశాడని గుర్తు చేసుకోవాలి.

అయితే.. చిన్న సినిమాలు చేయడంలో జగపతికి బోలెడంత ఎక్స్ పీరియన్స్ ఉంది. ఇప్పుడంటే పెద్ద విలన్ అయ్యాడు కానీ.. మొన్నమొన్నటి వరకూ చిన్న సినిమాలతోనే ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పుడు చిన్న సినిమాల పరిస్థితి దారుణంగా ఉంది. రిలీజ్ వరకూ తీసుకొచ్చినా థియేటర్లు దొరకని పరిస్థితిని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పిన జగపతి బాబు.. త్వరలో హైద్రాబాద్ లో కూడా ఇదే విషయంపై పాదయాత్ర చేయనున్నట్లు తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు