ఈ నీడను ఎవరూ పట్టించుకోవట్లేదే?

ఈ నీడను ఎవరూ పట్టించుకోవట్లేదే?

ఫస్ట్ లుక్ తో.. టీజర్ తో ఆకట్టుకున్న సినిమా.. ఆడియన్స్ లో ఆసక్తిని కలిగించిన సినిమాని.. ఇవాల్టి రోజుల్లో రిలీజ్ చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద విజయాలు సాధించిన చిత్రాలే ఇందుకు నిదర్శనం. అయితే.. నెపోలియన్ అంటూ తెరకెక్కిన ఓ సినిమా విషయంలో మాత్రం ఇందుకు రివర్స్ లో జరుగుతోంది.

'నా నీడ పోయింది సార్' అంటూ పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చే కాన్సెప్టుతో రూపొందిన మూవీ నెపోలియన్. ఫస్ట్ లుక్ లోనే నీడ లేకుండా రిలీజ్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. టీజర్ కూడా ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే విషయం మాత్రం ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం. ఇందుకు కారణం.. స్వయంగా ఆ సినిమా దర్శకుడే అనడంలో ఆశ్చర్యం లేదు. నెపోలియన్ మూవీకి రైటర్ కం డైరెక్టర్ ఆనంద్ రవి. ఇంకా విశేషం ఏంటంటే.. తనే హీరోగా కూడా నటించేశాడు. అసలు పాయింట్ ఏంటంటే.. తనే హీరోగా నటించడమే ఇప్పుడు నెపోలియన్ కు మైనస్ పాయింట్ అవుతుందని ఆనంద్ రవి ఊహించి ఉండడు.

ఇలాంటి విభిన్నమైన కాన్సెప్ట్ ను ఎవరైనా తెలిసిన హీరోతో కానీ.. మీడియం రేంజ్ హీరోను ఒప్పించి కానీ తెరకెక్కించి ఉంటే.. సినిమాపై బజ్ పీక్ స్టేజ్ లో ఉండేది. కానీ తనే హీరోగా నటించాలన్న ఆనంద్ రవి ఆలోచన కారణంగా.. బయ్యర్స్-డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆఫర్స్ రావడం లేదు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యేదెప్పుడో.. వెరైటీ కాన్సెప్ట్ ను జనాలకు చూపించగలిగేది ఎప్పుడో అనే అంశాలు... ఆనంద్ రవి అదృష్టం పై ఆధారపడి ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు