కథ నచ్చిందా? వల్లో పడ్డారా?

కథ నచ్చిందా? వల్లో పడ్డారా?

టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ బాగానే ఊపందుకుంటోంది. ఇద్దరు మాత్రమే కాదు.. నలుగురు కుర్ర హీరోలు కలిసి నటించేసిన కాన్సెప్ట్ తో కూడా సినిమా వచ్చింది. ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకధీరుడు కూడా రామ్ చరణ్- ఎన్టీఆర్ లతో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారనే టాక్ ఉంది. ఇప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఓ మల్టీ స్టారర్ తీయనున్నాడట.

యంగ్ హీరోలు నితిన్.. శర్వానంద్ లతో హరీష్ శంకర్ తీయనున్న మల్టీ స్టారర్ ఖాయమైందనే టాక్ ఇప్పుడు విపరీతంగా ఉంది. వీరిద్దరికీ కథ చెప్పడం కూడా పూర్తయిందట. త్వరలోనే మూవీ అనౌన్స్ మెంట్ కూడా వస్తుందని అంటున్నారు. అయితే.. డీజే  తర్వాత మళ్లీ ఇంతలోనే ఇంతటి భారీ చిత్రం అన్న దగ్గరే కొంతమందికి డౌట్స్ వస్తున్నాయి. నిజానికి గబ్బర్ సింగ్ మూవీతో హరీష్ శంకర్ సాధించిన విజయం చిన్నది కాదు. దాన్ని బేస్ చేసుకునే.. ఎన్టీఆర్ తో రామయ్యా వస్తావయ్యా చిత్రం చేయగలిగాడు. మధ్యలో గ్యాప్ తీసుకుని సుబ్రమణ్యం ఫర్ సేల్ అంటూ చిన్న సినిమా చేసినా.. మళ్లీ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం తీశాడు హరీష్ శంకర్.

ఎన్టీఆర్.. అల్లు అర్జున్ ల సినిమాల విషయంలో తన కథతో ఆడియన్స్ ను మెప్పించడంలో ఫెయిల్ అయ్యాడు హరీష్ శంకర్. డీజే కలెక్షన్స్ విషయంలో కూడా రాద్ధాంతం చేసి.. వివాదం సృష్టించాడు. కానీ ఇప్పుడు నితిన్.. శర్వాలను మల్టీస్టారర్ కి ఒప్పించగలగడం విశేషమే. ఇప్పుడు నితిన్.. శర్వానంద్ జోష్ లో ఉన్న హీరోలే. హరీష్ శంకర్ ట్రాక్ రికార్డ్ చూసి ఒప్పుకున్నారా.. ట్యాలెంట్ చూసి ఒప్పుకున్నారా.. కథ నచ్చి సినిమా చేయడానికి యాక్సెప్ట్ చేశారా.. ఇలా చాలా రకాల ప్రశ్నలే వినిపిస్తున్నాయి. మరి వీటికి ఆన్సర్ ఇచ్చేదెవరో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు