ఖాన్స్ కథ చెర్రీ-ఎన్టీఆర్ లకు చేరిందా?

ఖాన్స్ కథ చెర్రీ-ఎన్టీఆర్ లకు చేరిందా?

బాహుబలి ది కంక్లూజన్ మూవీ తర్వాత.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న మూవీ ఏదనే ప్రశ్నకు.. ఇప్పుడు దాదాపుగా సమాధానం దొరికేసింది. నేరుగా విషయం చెప్పకుండానే రామ్ చరణ్.. ఎన్టీఆర్ లతో కలిసి తను దిగిన ఫోటోను షేర్ చేసి రాజమౌళి ఇచ్చిన హింట్ ను జనాలు బాగానే పసిగట్టేశారు.

వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడీ ప్రాజెక్టుపై మరో ఆసక్తికరమైన సంగతి తెలుస్తోంది. ఎప్పటిలాగానే ఈ కథకు కూడా రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా.. ఇప్పటికే స్టోరీలైన్ ఓకే అయిపోయిందని.. స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్నారని అంటున్నారు. నిజానికి ఈ కథను వీరి కోసం అనుకోలేదట విజయేంద్ర ప్రసాద్. భజరంగీ భాయ్ జాన్ తర్వాత ఈ రైటర్ కి బాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ వచ్చిందో తెలిసిన విషయమే. అటు సల్లూ భాయ్.. ఇటు కింగ్ ఖాన్ షారూక్ లతో ఓ మల్టీ స్టారర్ రూపొందించే యోచనతో తొలుత కథను ప్రిపేర్ చేసుకున్నాడట బాహుబలి రైటర్.

బాహుబలి తర్వాత రాజమౌళికి కూడా బాలీవుడ్ లో అవకాశాలు చాలానే వచ్చినా.. టాలీవుడ్ మూవీతోనే మరోసారి సత్తా చాటాలని ఫిక్స్ అయిన జక్కన్న.. సల్మాన్-షారూక్ ల కోసం అనుకున్న కథను మెగా-నందమూరి కాంబినేషన్ గా మార్చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు జక్కన్నతో ఓ సినిమా చేయడం అంటే.. నేషనల్ లెవెల్ మూవీలో నటించడమే. అందుకే ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ ఈ ప్రాజెక్టుకు సై అనేసినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు