మెగా భోజనాలు బాగా పెడుతున్నారమ్మా!!

మెగా భోజనాలు బాగా పెడుతున్నారమ్మా!!

మెగా మీల్స్.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. హీరోలను.. అందులోనూ స్టార్స్ ను కలవడానికి అభిమానులు తెగ వచ్చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. కాకపోతే.. ఇలా రావడంలో వారి అంచనాలు అన్నీ.. ఓ సారి కలిసి.. కుదిరితే సెల్ఫీ ఒకటి లాగించేయడం వరకే ఉంటాయి.

కానీ హీరోలందు మెగా హీరోలు వేరయా అన్నట్లుగా అయిపోయింది వ్యవహారం. సుప్రీం హీరో అని మెగా ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటున్న సాయి ధరం తేజ్ మూవీ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి బోలెడంత మంది ఫ్యాన్స్ వచ్చేశారు. గచ్చిబౌలి ఏరియాలో జరుగుతున్న ఈ ప్రాంతానికి అభిమానులు తరలిరావడంతో.. వారితో కాసేపు ముచ్చట్లాడాడు తేజు. సెల్ఫీల తతంగం కూడా పూర్తయింది. కథ ఇక్కడితో అయిపోవాలి కానీ.. తేజు మాత్రం వచ్చిన అందరికీ భోజనాలు పెట్టించి మరీ పంపిచడం విశేషం. మెగా హీరో చూపించిన ఈ ఆదరానికి అభిమానులు కరిగిపోయారు.

రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా ఇలాగే చేశాడు. తను కూడా ఇన్వెస్టర్ కం పార్ట్నర్ గా.. స్పోర్ట్స్ బార్ ఓపెనింగ్ కోసం వచ్చిన బన్నీ.. తనకోసం వచ్చిన ఫ్యాన్స్ కు రెస్టారెంట్ లో ఫుల్ గా డిన్నర్ ఇచ్చి పంపించాడు. కొన్ని రోజులకే తేజు ఇదే పని చేయడంతో.. మీల్స్ కల్చర్ మెగా హీరోలకు బాగానే వంటబడుతోందని చెప్పుకుంటున్నారు సినీ జనాలు. కొన్ని నెలల క్రితం రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ చేసిన రామ్ చరణ్ కూడా.. షూటింగ్ చూసేందుకు వచ్చిన అందరికీ కాకపోయినా.. పిల్లలతో వచ్చిన వారికి ఇలాగే మీల్స్ ఎరేంజ్ చేశాడనేది తెలిసిన సంగతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు