ఈ అకౌంట్ అయినా బన్నీ వాసుదేనా?

ఈ అకౌంట్ అయినా బన్నీ వాసుదేనా?

తనకు ప్రకటించిన నంది అవార్డును తిరస్కరించేందుకు వెనుకాడనంటూ.. పోసాని కృష్ణ మురళి చేసిన కామెంట్స్.. టాలీవుడ్ లో సెన్సేషన్ అవుతున్నాయి. అంతేకాదు.. 'మేము నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అయితే.. మీకు తెలంగాణలో ఇల్లు- బిజినెస్ లు లేవా' అంటూ ఏకంగా సీఎం తనయుడు కం ఏపీ ఐటీ మినిస్టర్ ను నిలదీసేశాడు పోసాని.

ఇలా పోసాని నిప్పులు చెరిగిన కాసేపటికే.. పోసానిని ఉద్దేశించి 'మీరు అవార్డ్ అందుకునేందుకు 100 శాతం అర్హులు. మనమంతా ఏపీలో పుట్టాం. ఏపీలోనే పెరిగాం.. అమెరికాలో కాదు. ఏపీలో విద్యాభ్యాసం పూర్తి చేశాం- అమెరికాలో కాదు. మనం ఏపీవాసులం అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు' అంటూ బన్నీ వాసు పేరిట సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. అయితే.. ఈ పోస్టులు అయినా నిర్మాత బన్నీ వాసు చేసినవేనా అన్నదే ఇప్పుడు పాయింట్. కొన్ని రోజుల క్రితం కాసిన్ని ట్వీట్స్ పడగానే.. అబ్బే అది నా అకౌంట్ కాదు.. ఫేక్ అకౌంట్ అంటూ ఖండించేశాడు ఈ ప్రొడ్యూసర్.

అక్కడితో ఆగిపోతే సరిపోయేది కానీ.. తన ఖాతా కాదని పొద్దున చెప్పి.. సాయంత్రానికి అవే మాటలను టీవీల్లో వల్లె వేయడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పుడు కూడా పోసాని కామెంట్స్ మ్యాటర్లో కూడా బన్నీ వాసు అలాగే రివర్స్ లో కలరింగ్ ఇస్తాడా? లేకపోతే ఆ అకౌంట్ నాదే పోస్టులు నావే అంటాడా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఏమైనా బ్లూ టిక్ లేదు కాబట్టి.. వెరిఫైడ్ అకౌంట్ కాదు కాబట్టి.. ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు