చ‌నువుగా ఉంటే ఎఫైర్ అనేశారు: స‌్వాతి

చ‌నువుగా ఉంటే ఎఫైర్ అనేశారు: స‌్వాతి

మాటీవీలో ప్ర‌సార‌మైన క‌ల‌ర్స్ షో తో బ‌బ్లీ గ‌ర్ల్ గా పాపుల‌ర్ అయిన స్వాతి...ఆ త‌ర్వాతి కాలంలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కేవ‌లం తెలుగు భాష‌లోనే కాకుండా త‌మిళ‌,మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా ప‌లు చిత్రాల్లో న‌టించింది. చాలాకాలం త‌ర్వాత లండ‌న్ బాబులు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ స్వాతి ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. త‌న‌కు ఎప్పుడూ స‌క్సెస్ రేటు త‌గ్గ‌లేద‌ని, నిదానంగా వ‌చ్చే సక్సెస్ ల‌తో తాను సంతోషంగా ఉన్నాన‌ని చెప్పింది. త‌న‌కు స‌క్సెస్ త‌గ్గిన‌పుడ‌ల్లా ఓ మంచి హిట్ వ‌చ్చేద‌ని,  'ఆడవారి మాటలకి అర్థాలు వేరులే' .. 'సుబ్రమణ్య పురం'.. స్వామిరారా' హిట్స్ ఆ విధంగా  వచ్చినవేన‌ని చెప్పింది. త‌న‌కు వెనువెంట‌నే సక్సెస్ లు రాలేద‌ని, ఒక్కసారిగా సక్సెస్ గ్రాఫ్ పెరగడం, త‌గ్గ‌డం జరగలేద‌ని తెలిపింది.

తాను న‌టించిన సినిమాల్లో హీరోలందరితో ఎఫైర్లు అంట‌గ‌ట్టార‌ని, త‌న‌కూ ఓ ఫ్యామిలీ ఉంటుంద‌ని, ఆ వ్యాఖ్య‌ల‌కు చాలా బాధేసింద‌ని అన్నారు. మొద‌ట్లో వాటిని ప‌ట్టించుకునే దానిన‌ని, ఆ త‌ర్వాత లైట్ తీసుకోవ‌డం ప్రారంభించాన‌ని చెప్పింది. అల్ల‌రి న‌రేష్‌, నాని, నిఖిల్, త‌మిళ హీరో జై, ...ఇలా దాదాపు అంద‌రితో త‌న‌కు ఎఫైర్లున్నాయ‌ని రూమ‌ర్లు వ‌చ్చాయ‌ని చెప్పింది. ఓ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ పాట పాడే అవ‌కాశం ఇచ్చార‌ని, దాంతో ఆయ‌న‌తో కూడా రూమ‌ర్ వ‌చ్చింద‌ని తెలిపింది. సహజంగానే తాను కో ఆర్టిస్టులతో చనువుగా ఉంటాన‌ని, అందువలన అలాంటి రూమర్స్ వచ్చి ఉండొచ్చ‌ని అడ్జ‌స్ట్ అయ్యాన‌ని చెప్పింది. కొన్ని సందర్భాల్లో అవి ఇబ్బంది పెడుతూనే ఉంటాయ‌ని  చెప్పుకొచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు