అది తప్పే అని ఒప్పుకున్న నారా బాబు

అది తప్పే అని ఒప్పుకున్న నారా బాబు

తెలుగులో ఒక హీరో ఒకేసారి ఏడెనిమిది కమిట్మెంట్లతో ఉండటం ఎప్పుడైనా చూశారా? యువ కథానాయకుడు నారా రోహిత్ విషయంలో ఇలా జరిగింది. అతను రెండేళ్ల కిందట ఏడెనిమిది సినిమాలు కమిటై ఉన్నాడు. ఒకేసారి సమాంతరంగా మూణ్నాలుగు సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడిపాడు అతను. అందులోంచి గత ఏడాది ఏకంగా అరడజను సినిమాలు రిలీజవడం విశేషం.

ఐతే క్వాంటిటీ ఎక్కువైతే క్వాలిటీ ఉండదనడానికి సూచికగా ఈ ఆరు సినిమాల్లో కేవలం రెండు మాత్రమే విజయవంతం అయ్యాయి. మిగతా నాలుగు సినిమాలూ దారుణమైన ఫలితాలు చవిచూశాయి. ఏడాది ఆరంభంలో ‘తుంటరి’, ‘సావిత్రి’, ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాలు అతడికి షాకుల మీద షాకులిస్తే.. ద్వితీయార్ధంలో ‘శంకర’ దెబ్బ కొట్టింది.

ఐతే ‘జ్యో అచ్యుతానంద’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలు విజయవంతమై రోహిత్‌‌కు ఊరటనిచ్చాయి. ఐతే ఇంతకుముందు అలా లెక్కకు మిక్కిలి సినిమాలు చేయడం తప్పే అని రోహిత్ ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. గత ఏడాది అలా తీరిక లేకుండా సినిమాలు చేయడం వల్ల ఏ సినిమా మీదా ప్రత్యేకంగా దృష్టిపెట్టే అవకాశం లేకపోయిందని.. తన సినిమాలు తానే చూసుకోలేని పరిస్థితి కూడా తలెత్తిందని రోహిత్ తెలిపాడు.

కాబట్టి ఇకపై అలా ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయొద్దని నిర్ణయించుకున్నానని.. అందుకే ఆచితూచి, నెమ్మదిగా సినిమాలు చేస్తున్నానని అతను వెల్లడించాడు. రోహిత్ నటించిన కొత్త సినిమా ‘బాలకృష్ణుడు’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. దీని తర్వాత ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరితో, ‘సావిత్రి’ దర్శకుడు పవన్ సాధినేనిలతో సినిమాలు మొదలుపెట్టనున్నట్లు రోహిత్ చెప్పాడు. దీంతో పాటు మల్టీస్టారర్ మూవీ ‘వీరభోగ వసంత రాయలు’ కూడా చేస్తున్నానన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English