ఈ వారం కూడా పది సినిమాలు..

ఈ వారం కూడా పది సినిమాలు..

నవంబరు నెలలో చిన్న సినిమాల క్లియరెన్స్ కొనసాగుతోంది. ఈ నెల తొలి వారంలో మూడు సినిమాలు రిలీజైతే.. తర్వాతి వారంలో నాలుగు సినిమాలొచ్చాయి. గత వారాంతంలో ఏడెనిమిది సినిమాల దాకా రిలీజయ్యాయి. ఇక వచ్చే వారం కూడా ఈ ఒరవడి కొనసాగోబోతోంది. చాన్నాళ్లుగా విడుదలకు నోచుకోని చాలా చిన్న సినిమాల్ని రిలీజ్ చేసేసి.. మమ అనిపించబోతున్నారు. వీటితో పాటు రెండు మూడు చెప్పుకోదగ్గ సినిమాలు కూడా రేసులో ఉన్నాయి.

ఈ శుక్రవారం రిలీజయ్యే వాటిలో కొంచెం పెద్ద సినిమా అంటే.. నారా రోహిత్ నటించిన ‘బాలకృష్ణుడు’నే. పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఓ మోస్తరు స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు ‘పెళ్లిచూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన ‘మెంటల్ మదిలో’ను సురేష్ బాబు అండతో బాగానే రిలీజ్ చేయబోతున్నారు.

aప్రధానంగా ప్రేక్షకుల దృష్టి ఈ రెండు సినిమాల మీదే ఉంది. ఇక ‘ప్రతినిధి’ రచయిత ఆనంద్ రవి కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘నెపోలియన్’ కూడా 24నే రిలీజవుతుంది.

ఇవి కాక సాయిపల్లవి మలయాళ డబ్బింగ్ సినిమా ‘హేయ్ పిల్లగాడా’.. కామెడీ థ్రిల్లర్ ‘దేవిశ్రీ ప్రసాద్’తో పాటు ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారు’.. ‘బేబీ’..  ‘లచ్చి’.. ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’.. ‘జూన్ 143’.. అంటూ ఏవేవో సినిమాలు లైన్లో ఉన్నాయి. గత వారం కూడా ఇలాగా చిన్నా చితకా సినిమాలన్నింటినీ రిలీజ్ చేశారు. వాటిని జనాలు పట్టించుకున్నదే లేదు. మరి ఇవి కూడా ఏదో రిలీజయ్యాయంటే అయ్యానడమే తప్ప ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కష్టమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English