విశ్వనాథ్ కథ.. జంధ్యాల మాటలు.. మణిరత్నం డైరెక్షన్

విశ్వనాథ్ కథ.. జంధ్యాల మాటలు.. మణిరత్నం డైరెక్షన్

విశ్వనాథ్ కథ.. జంధ్యాల మాటలు.. ఇంత వరకు బాగానే ఉంది. ఈ కలయికలో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. కానీ మణిరత్నం డైరెక్షన్ అన్నదే చిత్రంగా ఉంది కదా. ఈ కాంబినేషన్ ఏంటో అర్థం కావడం లేదు కదా. ఇది ఒక ఊహాజనితమైన మాట. ‘మెంటల్ మదిలో’ సినిమా చూసిన తనకు ఈ ముగ్గురూ కలిసి ఈ సినిమా చేసినట్లుగా అనిపించిందని హీరో శ్రీవిష్ణు తెలిపాడు. ఇది తన పర్సనల్ ఫీలింగ్ అని అతను చెప్పాడు.

‘‘మెంటల్ మదిలో సినిమా చేశాక.. సినిమా చూసుకున్నాక నాకు కలిగిన ఫీలింగ్ గురించి చెబుతాను. విశ్వనాథ్ గారు కథ అందించి.. జంధ్యాల గారు మాటలు రాసి.. ఆ స్క్రిప్టును మణిరత్నం గారు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఈ సినిమా ఉంటుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ అంత అద్భుతంగా ఈ సినిమా తీశాడు. ఇంత చిన్న వయసులో అతను ఇలాంటి సినిమా తీయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఈ సినిమా చూసినపుడు.. థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా ఒక చిరు నవ్వు ప్రేక్షకుల పెదవుల మీద అలాగే నిలిచి ఉంటుంది. ఈ సినిమా అనే కాదు.. వివేక్ ఆత్రేయ అనే దర్శకుడు తీసే ప్రతి సినిమాకూ ఆ చిరునవ్వు కచ్చితంగా అలాగే ఉంటుంది. ఈ దర్శకుడు నాకు ఎంతగా క్లోజ్ అయిపోయాడంటే.. మమ్మల్నిద్దరినీ కలిపి ఒక గదిలో వదిలేస్తే కొన్ని సంవత్సరాల పాటు ఇంకేమీ లేకుండా మాట్లాడుకుంటూ గడిపేస్తాం. ఈ సినిమా అయ్యాక కూడా మేం కలిసి పని చేసిన ఆఫీస్‌ను అలాగే ఉంచేయాలని కోరుకుంటున్నా. అప్పుడప్పడూ అక్కడికొచ్చి కలిసి మాట్లాడుకుంటాం’’ అని శ్రీవిష్ణు అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు