నారా ప్యాకులు ఆ పోస్టర్ వరకేనా

నారా ప్యాకులు ఆ పోస్టర్ వరకేనా

నారా రోహిత్ ఇప్పుడు మాంచి జోష్ మీద ఉన్నాడు. తొలిసారిగా ఈ యంగ్ హీరో ఫుల్ ప్లెడ్జెడ్ మాస్ ఎంటర్టెయినర్ అయిన బాలకృష్ణుడు మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతోన్నాడు. ఇప్పటివరకూ దాదాపుగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్న నారా రోహిత్.. ఫస్ట్ టైం పూర్తి స్థాయి మాస్ మసాలా ట్రై చేస్తున్నాడు. అయినా సరే.. ఈ మూవీ ట్రైలర్ కు అపూర్వమైన స్పందన వచ్చింది.

కానీ ఇప్పుడు ఓ న్యూస్.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకూ ఉన్న టాక్ ప్రకారం.. బాలకృష్ణుడులో నారా రోహిత్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడని అన్నారు. కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాటలు.. అందులోనూ యూనిట్ నుంచి వస్తున్న ఫీలర్లను పరిశీలిస్తే.. బాలకృష్ణుడు చిత్రంలో నారా వారబ్బాయి.. సిక్స్ ప్యాక్ చూపించడం లేదట.

బబ్లీ హీరోగా ఇన్నాళ్లు గుర్తింపు పొందిన ఈ హీరో.. అప్పుడే సిక్స్ ప్యాక్ చేయకపోవడం కరెక్టే కావచ్చు. కానీ బాలకృష్ణుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినపుడు.. 6 ప్యాక్ తో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. అది ఫోటోషాప్ వర్క్ అంటూ చాలామంది పెదవి విరిచినా కూడా.. అబ్బే నిజంగానే సిక్స్ ప్యాక్ చేశాడంటూ నానా రచ్చ చేశారు.

తీరా ఇప్పుడు సినిమాలో అలాంటిదేమీ లేదంటే.. ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఈ కుర్రాడు ఇప్పుడు 20 కేజీలు తగ్గి మాంచి ఫిజిక్ తో అదిరిపోయే షేప్ లోకి ఛేంజ్ అయిన మాట నిజమే కానీ.. బాలకృష్ణుడు షూటింగ్ సమయానికి ఇంకా ప్యాకులు రెడీ కాలేదట. ఫస్ట్ లుక్ పోస్టర్ లో 6 ప్యాకులు చూపించి.. ఇప్పుడు అలాంటివేమీ లేవంటే.. మరి పోస్టర్లో చూపించిన ఆ ప్యాకులన్నీ ఫేకులే కదా అంటూ పలువురు ఫిలింనగర్ జనాలు తెగ గుసగుసలాడేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English