సమంత అప్పిచ్చిందా? ఆదుకుందా?

సమంత అప్పిచ్చిందా? ఆదుకుందా?

టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత తన పెళ్లి తర్వాత తొలిసారిగా ఓ పబ్లిక్ ఈవెంట్ కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. నారా రోహిత్ హీరోగా రూపొందిన బాలకృష్ణుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సమంత చేసిన సందడి అంతా ఇంతా కాదు. అంతవరకూ ఓకే కానీ.. ఈ మూవీకి సామ్ ఫైనాన్షియర్ అవతారం ఎత్తిందని.. ఏకంగా 3 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిందనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

ఓ ఈవెంట్ కు వచ్చి సాటి హీరో సినిమాను ప్రమోట్ చేసినంత మాత్రాన.. ఇలా ఫైనాన్స్ చేసేస్తుందా అనే డౌట్ ఇప్పుడు చాలా మందిలో ఉంది. నిజానికి ఈ ఈవెంట్ కు సమంత అటెండ్ కావడానికి రీజన్.. మేనేజర్ గిరిధర్ అంటారు. అతని కోసమే ఈ కార్యక్రమానికి సామ్ వచ్చిందట. అక్కడి నుంచి ఇలాంటి రూమర్స్ బిగిన్ అయిపోయాయి. అంతేకాదు.. 3 కోట్లకు బదులుగా సినిమా రైట్స్ తనతో పెట్టేసుకుందని కూడా ఒక రూమర్ వినిపిస్తోంది. ఒకవేళ సమంత నిజంగా పెట్టుబడి పెట్టినా.. ఆ విషయం బయటకు చెప్పే ఛాన్సులు చాలా తక్కువ. ఇందుకు కారణం కూడా.. ఆ మేనేజరే.

నిజానికి గిరిధర్ కారణంగా.. సమంతకు దాదాపు 10 సినిమాలు వచ్చాయట. సమంత స్థాయి ప్రకారం ఒక్కో మూవికి కోటిన్నర రూపాయల కోటి రెమ్యూనరేషన్ తీసుకుని ఉండొచ్చు. ఇలాంటి సమయంలో ఒకవేళ మూవీ రిలీజ్ కోసం తనకు చేతనైన సాయం చేసినా.. అందుకు బదులుగా సినిమా రైట్స్ ను దగ్గర పెట్టేసుకోవడం లాంటి డీల్స్ చేసుకుంటుందా అంటే అనుమానమే. తనంతట తనే బోలెడంత మందికి అడక్కపోయినా సాయం చేసే సమంత.. తన కెరీర్ కు హెల్ప్ చేసిన వ్యక్తికి ఓ రేంజ్ లో సాయం చేసినా.. బయటకు చెప్పే అవకాశాలు బాగా తక్కువే. కాబట్టి ఆదుకుంటే ఆదుకుని ఉండొచ్చుగాని.. అప్పుగా ఇచ్చిందంటే మాత్రం డౌటే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English