నిర్మాతలని బెదరగొడుతున్న హీరోయిన్‌

నిర్మాతలని బెదరగొడుతున్న హీరోయిన్‌

లోఫర్‌ సినిమాతో పూరి జగన్నాథ్‌ పరిచయం చేసిన దిషా పటానికి ఆ సినిమా నిమిత్తం పది లక్షల పారితోషికం కూడా ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఆమెతో ఒప్పందం చేసుకోవాలంటే అన్నీ కలిపి కోటిన్నర ఇవ్వాలని అడుగుతోందట. లోఫర్‌ తర్వాత హిందీలో డెబ్యూ చేసిన దిషా పటానికి ఇంకా అక్కడ గ్రాండ్‌ సక్సెస్‌ ఏమీ రాలేదు. అయితే అందాల ఆరబోతలో ఏడాకులు ఎక్కువే చదివిన కారణంగా ఆమెకి మీడియాలో ఫుల్‌ కవరేజ్‌ లభిస్తోంది.

దానికి తోడు బికినీల్లో అందాలని ప్రదర్శించడానికి ఏమాత్రం వెనకాడని ఆమె నైజం ఇంటర్నెట్‌లో దిషాని సెన్సేషన్‌ చేసింది. ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ఎనిమిది మిలియన్ల ఫాలోవర్లున్నారు. బాగా పేరున్న హీరోయిన్లకి కూడా తన మాదిరిగా ఫాలోవర్లు పెరగడం లేదు. ఆమెకి వున్న పాపులారిటీని గుర్తించి మెన్స్‌ మ్యాగజైన్స్‌ ఆమెతో కవర్‌ షూట్‌ చేస్తున్నాయి.

బాలీవుడ్‌లో ఆఫర్లుండడంతో దిషా దక్షిణాదికి రావాలంటే సరాసరి టాప్‌ హీరోయిన్లతో సమానంగా పే చేయాలంటోందట. దీంతో మెహ్రీన్‌లాంటి అందుబాటులో వున్న హీరోయిన్లతో నిర్మాతలు అడ్జస్ట్‌ అయిపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు