బాలకృష్ణపై అంత రిస్కా?

బాలకృష్ణపై అంత రిస్కా?

బాలకృష్ణ సినిమా హిట్టయితే వసూళ్లకి ఢోకా వుండదు కానీ సినిమా ఫ్లాప్‌ అయితే మాత్రం రికవరీ చాలా కష్టం. 'పైసా వసూల్‌' చిత్రానికి అసలు పోటీ లేకపోయినా, అది రిలీజ్‌ అయిన మరో మూడు వారాల వరకు పెద్ద సినిమా ఏదీ రాకపోయినా కానీ రికవర్‌ కాకపోగా, బయ్యర్లకి భారీ నష్టాలు మిగిలాయి. అదే బాలయ్య సినిమాకి హిట్‌ టాక్‌ వస్తే పోటీతో సంబంధం లేకుండా గ్యారెంటీ కలక్షన్లు వస్తాయి.

ఈ ధీమాతోనే బాలయ్య సినిమాలని తరచుగా వేరే పెద్ద సినిమాలతో పోటీగా విడుదల చేస్తుంటారు. సంక్రాంతికి రాబోతున్న 'జైసింహా' చిత్రానికి నిర్మాత సి. కళ్యాణ్‌ కళ్లు చెదిరే రేట్లు చెబుతున్నాడట. ఈ సినిమా గ్యారెంటీ హిట్‌ అని, లెజెండ్‌కి మించిన విజయం సాధిస్తుందని చెబుతూ అన్ని ఏరియాల్లోను పైసావసూల్‌ అమ్మిన దానికంటే ఒక ముప్పయ్‌, నలభై శాతం ఎక్కువే రేట్లు కోట్‌ చేస్తున్నాడట. నిర్మాతగా సి. కళ్యాణ్‌కి అసలు సక్సెస్‌లు లేవు. కె.ఎస్‌. రవికుమార్‌ ఈమధ్య కాలంలో హిట్‌ సినిమా ఏమీ తీయలేదు.

బాలయ్య సినిమాలు అయితే అటు, లేదంటే ఇటు అన్నట్టుంటాయి. దీంతో ఎవరి మీద నమ్మకంతో ఇంత రేట్లు ఇవ్వాలని బయ్యర్లు బిడాయించుకున్నారట. అసలే పవన్‌, త్రివిక్రమ్‌ల అజ్ఞాతవాసితో పోటీ పడుతోంది కనుక వెనకా ముందు ఆలోచించకుండా రేట్లు పెట్టలేమని అంటున్నారట. అయితే ఒకసారి ట్రెయిలర్‌ చూస్తే సినిమా రేంజ్‌ ఏంటనేది తెలుస్తుందని, అందాక తగ్గేది లేదని నిర్మాత దిగి రావడం లేదట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English