పెళ్లిచూపులు మ్యాజిక్‌ రిపీట్‌ అవడం ఈజీనా?

పెళ్లిచూపులు మ్యాజిక్‌ రిపీట్‌ అవడం ఈజీనా?

పెళ్లిచూపులు చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న నిర్మాత రాజ్‌ కందుకూరి తన తాజా చిత్రం 'మెంటల్‌ మదిలో'ని కూడా సేమ్‌ స్ట్రాటజీతో ప్రమోట్‌ చేస్తున్నాడు. పెళ్లిచూపులు విడుదలకి ముందు చాలా మందికి ప్రత్యేక షోలు వేసారు. ఇండస్ట్రీ వాళ్లకి, మీడియా వాళ్లకి, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకి షోల మీద షోలు వేసారు.

విడుదలకి ముందే హిట్‌ సినిమా కళ వచ్చేయడంతో పెళ్లిచూపులు విడుదలయ్యే నాటికే బజ్‌ బీభత్సంగా వుంది. అదే తరహాలో మెంటల్‌ మదిలో సినిమాని కూడా ప్రమోట్‌ చేస్తున్నారు. ఇండస్ట్రీ వాళ్లకి వేస్తోన్న షోస్‌ నుంచి పాజిటివ్‌ బజ్‌ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రం పెళ్లిచూపులు మాదిరి మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇందులో హీరోగా నటించిన శ్రీవిష్ణు ఇప్పటికే చాలా చిత్రాల్లో నటించాడు కానీ ఇంకా విజయాన్ని అందుకోలేదు. నటుడిగా అతడికి మంచి పేరే వుంది కానీ ఇంకా థియేటర్లకి జనాన్ని రాబట్టే స్టార్‌డమ్‌ రాలేదు.

శ్రీవిష్ణు వల్ల ఈ చిత్రానికి అదనంగా వచ్చే బెనిఫిట్‌ ఏమీ వుండదు కానీ ఈ చిత్రం కూడా పెళ్లిచూపులు రేంజ్‌ సక్సెస్‌ అయితే మాత్రం అతని కెరియర్‌ టర్న్‌ అవుతుంది. విజయ్‌ దేవరకొండలా శ్రీవిష్ణు కూడా స్టార్‌ అయిపోవచ్చు. మరి పెళ్లిచూపులు లాంటి మ్యాజిక్‌లు వరుసగా చేయడం సాధ్యమయ్యే పనేనా? ఈ శుక్రవారం తెలుస్తుందది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు