అంటే దీపిక మన గురించి ఏమనుకుంది?

అంటే దీపిక మన గురించి ఏమనుకుంది?

నిన్న అమరావాతిలో సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్ కార్యక్రమంలో.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె సందడి చేసింది. అమ్మడు గ్రీన్ కలర్ శారీలో మెరిసిపోతూ.. అక్కడ 'మోస్ట్ యాక్టివ్ సెలబ్రిటీ ఆన్ సోషల్ మీడియా' అవార్డ్ తీసుకుంది. అయితే ఈ అవార్డు తీసుకునేటప్పుడు.. దీపిక ఇచ్చిన స్పీచ్ చూస్తే మాత్రం.. ఎక్కడో తెలుగోళ్లందరికీ తేడా కొట్టేసింది.

నిజానికి ఆంధ్రప్రదేశ్‌ లో జరుగుతున్న ఒక ఈవెంటకు విచ్చేస్తే.. సాధారణంగా సెలబ్రిటీలు ఏ బాష మాట్లాడతారు? అమ్మడు మాత్రం స్టేజీ మీద 'ఆప్ సభీకో ధన్యవాద్' అంటూ హిందీలో తన గళాన్ని ఎత్తుకుంది. అంటే ఇక్కడ అందరూ లోకల్స్ కాబట్టి.. హిందీలో స్పీచ్ ఇచ్చేద్దాం అనుకుందా ఏంటి? నిజానికి బీహార్ లోనూ.. ఉత్తర ప్రదేశ్‌ లోనో వెళ్ళి స్పీచ్ ఇచ్చినట్లు.. అమ్మడు హిందీలో మాట్లాడింది. మన దగ్గర ఇంగ్లీష్‌ మాట్లాడితే 80% ఆడియన్స్ కు అర్ధమవుతుంది కాని.. హిందీ మాత్రం 30% ఆడియన్స్ కే అర్దమవుతుంది. ఆ విషయం తెలియక అమ్మడు హిందీలో నాలుగు ముక్కలు చెప్పేసింది. కాని చక్కగా సోషల్ మీడియా గురించి ఇచ్చే అవార్డుల కార్యక్రమంలో ఇంగ్లీషులోనే మాట్లాడాల్సింది కదా? నార్త్ రాష్ట్రాల తరహాలో ఇక్కడ కూడా ఆంగ్లం మన జనాలకు అర్ధమవదు అనుకుందా ఏంటి?

ఏదేమైనా కూడా.. దీపిక హిందీలో మాట్లాడటం మాత్రం.. ఆంధ్రరాష్ట్ర అభిమానులకు పెద్దగా నచ్చలేదు. అందుకే అనిరుధ్ ను చూడండి.. చక్కగా ఇంగ్లీషులో రెండు ముక్కలు చెప్పేసి.. తెలుగులో పాట పాడేసి ఇంప్రెస్ చేశాడు. పైగా దీపిక పూర్తి స్థాయి నార్త్ అమ్మాయి కాదు కదా.. కన్నడ పిల్లే కదా.. మరి అయినా కూడా హిందీలో బ్యాటింగ్ ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు