అవినాష్‌గా మారిన అఖిల్

అవినాష్‌గా మారిన అఖిల్

హీరోగా తన తొలి సినిమాకు తన పేరే పెట్టుకున్నాడు అఖిల్. ఆ సినిమాలో అతడి పాత్ర పేరు కూడా అఖిలే. ఐతే ఆ సినిమా అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పుడు ‘హలో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ టైటిల్ జనాల్లో బాగానే రిజిస్టరైంది. ఇంతకీ ఈ సినిమాలో అఖిల్ పాత్ర పేరేంటి అన్న ఆసక్తి జనాల్లో ఉంది.

దానికి బదులిచ్చేసింది చిత్ర బృందం. ‘హలో’లో అఖిల్ పాత్ర పేరు.. అవినాష్. ఏదో వేడుక కోసం రెడ్ డ్రెస్సులో అందంగా తయారై.. చేతిలో గిఫ్ట్ బాక్స్ పట్టుకుని తయారుగా ఉన్న అఖిల్ కొత్త లుక్ ఒకటి ఈ రోజు రిలీజ్ చేస్తూ.. అతడి పాత్ర పేరును ప్రకటించారు. అవినాష్‌కు హలో చెప్పమని ఈ పోస్టర్ మీద వేశారు.

రెండు రోజుల కిందటే రిలీజైన ‘హలో’ టీజర్ టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. సినిమా యాక్షన్ ప్యాక్డ్ రొమాంటిక్ స్టోరీలాగా సాగేలా అనిపిస్తోంది ఈ టీజర్ చూస్తే. ప్రస్తుతం ‘అఖిల్’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆరంభం కాబోతున్నాయి.

వర్మ దర్శకత్వంలో చేయబోయే సినిమా పది రోజుల షెడ్యూల్ అయ్యాక నాగ్ పూర్తిగా అఖిల్ సినిమా మీదే దృష్టిసారించి ప్రమోషన్ చేయించనున్నాడు. డిసెంబరు 22న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం కానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు