రకుల్.. గ్లామర్ పాత్రలే కరక్టేమో

రకుల్.. గ్లామర్ పాత్రలే కరక్టేమో

ఈ సీజన్లో వరుసపెట్టి ఇరగదీస్తుంది అనుకుంటే.. హాట్ బ్యూటి రకుల్ ప్రీత్ కౌర్ మాత్రం.. అటు తన పాత్రలతో ఆకట్టుకోలేక.. ఇటు ఆ పాత్రల వలన సినిమాలకూ పెద్దగా ఉపయోగం జరగక.. పైగా ఆ సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుని.. అమ్మడి కెరియర్ ను సందిగ్ధంలోకి నెట్టేశాయి. నిన్న రిలీజైన ఖాకీ సినిమా కూడా అమ్మడికి పెద్దగా ప్లస్ అయ్యేలా కనిపించట్లేదు.

విషయం ఏంటంటే.. ఖాకి సినిమాలో కూడా సీదాసాదాగా కనిపించే పాత్రలోనే నటించిన రకుల్. అమ్మడు అసలు ఇలాంటి పాత్రల్లో కనిపించిన ప్రతీసారీ ఆ పాత్రలూ ఆ సినిమాలూ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. రారాండోయ్ వేడుక చూద్దాం సినిమా ఒక్కటే బాగా ఆడింది. ఓవరాల్ గా చూసుకుంటే.. స్పైడర్ .. ఖాకీ మొదలగు సినిమాల్లో రకుల్ ఎక్కడా కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఒకవేళ ఆమె గ్లామర్ దర్శనంతో అదరగొట్టేసుంటే.. బి అండ్ సి సెంటర్లలో సినిమాకు బాగా మైలేజ్ వచ్చుండేదమో అనేది చాలామంది అభిప్రాయం. అందుకే వారు రకుల్ కు గ్లామర్ పాత్రలే రైటు అంటున్నారు.

కాకపోతే సినిమా విమర్శకులు మరియు రకుల్ అభిమానులు మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే.. సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు.. సినిమాలో రకుల్ పాత్ర ఎలా ఉన్నా కూడా ఆడుతుంది. రారండోయ్ వేడుక చూద్దాం అందుకు ఉదాహరణ. ఒకవేళ సినిమాలో రకుల్ విపరీతంగా హాట్ గ్లామర్ దట్టించేసినా కూడా.. కంటెంట్ బాలేకపోతే అది బ్రూస్ లీ అవుతుంది. ఓవర్ టూ రకుల్!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు