బాలయ్య కోర్టులో బాల్ వేసేదెవరు??

బాలయ్య కోర్టులో బాల్ వేసేదెవరు??

ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా తాను చేయాల్సిన పనులను చూసుకుంటూ బిజీగా ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అయితే ఆయన కనిపిస్తే చాలు.. వెంటనే కొన్ని విషయాలపై క్లారిటీ అడిగేయాలని చూస్తోంది మీడియా. మ్యాటర్ అర్ధమైందిగా.. అసలు నంది అవార్డుల గురించి రేగిన చిచ్చును.. బాలయ్య సమాధానాలు లేకుండా ఎవరన్నా ఆర్పగలరా? అందుకే ఆయన కామెంట్స్ చాలా ముఖ్యం.

అయితే ఇప్పుడు అందరినీ కన్య్ఫూజ్ చేస్తున్న విషయం ఏంటంటే.. అసలు బాలయ్య మైకు ముందుకు రాగానే.. సార్ నంది అవార్డులు గురించి ఇలా జరుగుతోంది అంటూ ఎవరన్నా అడగేవారున్నారా? ఒకవేళ నంది అవార్డ్స్ పై మీ కామెంట్స్ అంటే.. 'జ్యూరి ఇచ్చింది. విమర్శల పర్వం ఎప్పుడూ మామూలే' అంటూ సింగిల్ లైన్లో ఆయన క్లోజ్ చేసేయొచ్చు. అలా కాదు సార్..మీ 'లెజెండ్' అనే సినిమాకు అన్నేసి నందులు వచ్చాయని గొడవ జరుగుతోంది అంటూ ఆయన్న ప్రశ్నించేదెవరు? పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు బాలయ్య స్పందన గురించి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ అవార్డులు గురించి ఎవరెన్ని కామెంట్లు చేసినా కూడా.. బాలయ్య మాటే ఫైనల్ గా ఫైనల్. కాబట్టి ఆయన కామెంట్స్ కోసం అందరూ వెయిటింగ్.

కాని బాలయ్య కోర్టులో బాల్ వేసి.. ఆన్సర్లు రాబట్టే ప్రయత్నం చేయాలని కొన్ని టాప్ టివి ఛానల్స్ ప్రయత్నిస్తున్నాయట. ఎందుకంటే వారికి నంది అవార్డుల పుణ్యమా అంటూ అసలు పడిపోతున్న టీఆర్పీలు ఒక్కసారిగా పెరిగిపోయాయ్. ఆ విధంగా వారు ఈ రేటింగుల స్కీమును బృహత్తరమైన విజయంగా తీర్చిదిద్దుకోవాలని చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు