సందీప్ సినిమాను చంపేశారుగా..

సందీప్ సినిమాను చంపేశారుగా..

సందీప్ కిషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ‘కేరాఫ్ సూర్య’. ఈ సినిమాతో తెలుగులో మళ్లీ మంచి హిట్టు కొడతానని ఆశించాడతను. సుశీంద్రన్ లాంటి పేరున్న దర్శకుడు తీసిన సినిమా కావడంతో సందీప్ కచ్చితంగా మంచి ఫలితాన్ని అందుకుంటాడనే అందరూ అనుకున్నారు.

కానీ ఈ సినిమా యావరేజ్ టాక్ రాగా.. అందుకు తగ్గ వసూళ్లు కూడా రాలేదు. చాలా పేలవమైన వసూళ్లతో సినిమా వారం తిరిగే సరికి అడ్రస్ లేకుండా పోయింది. ఐతే కనీసం తమిళంలో అయినా తన విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుందని.. ఈ సినిమా ఆడుతుందని ఆశించాడు సందీప్. ఐతే కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అక్కడ కూడా ఈ సినిమా ఆడలేదు.

రిలీజ్‌కు ముందు ప్రెస్ షో వేసినపుడు హీరోయిన్ పాత్ర అడ్డంకిగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవడంతో దర్శకుడు మొహమాట పడకుండా 20 నిమిషాల హీరోయిన్ పోర్షన్ లేపేసి రిలీజ్ చేశాడు. అయినా కూడా జనాల స్పందన అంతంతమాత్రంగానే ఉంది. చివరికి ఆశ్చర్యకరంగా నిన్నట్నుంచి సినిమాను థియేటర్ల నుంచి లేపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాను రీ ఎడిట్ చేసి డిసెంబరు 15న రీరిలీజ్ చేస్తామని దర్శకుడు సుశీంద్రనే స్వయంగా ప్రకటించాడు. హీరోయిన్ పోర్షన్ లేపేయడంపై ఈ చిత్ర నిర్మాత బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు.
మెహ్రీన్‌కు రూ.20 లక్షల దాకా చెల్లించి హీరోయిన్‌గా తీసుకొచ్చామని.. ఆమె పార్ట్ మొత్తం లేపేయడం ఏం న్యాయమని.. ఇలాంటి వాటిపై ముందే స్పష్టత ఉండాలని ఆయన మీడియాతో అన్నారు.

ఓవైపు నిర్మాతతో గొడవ, మరోవైపు సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రజాదరణ లేకపోవడంతో సినిమాను థియేటర్ల నుంచి వెనక్కి తీసేసినట్లు తెలుస్తోంది. ఐతే వారం రెండు వారాల్లో సినిమాల ప్రదర్శనకు తెరపడుతున్న ఈ రోజుల్లో ఒకసారి రిలీజ్ చేసి, వారం గడిచాక సినిమాను వెనక్కి తీసి.. ఇంకో నెల రోజుల తర్వాత మళ్లీ రిలీజ్ చేస్తే జనాలు ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే. అటు ఇటు చేసి ఈ సినిమాను చిత్ర బృందమే దెబ్బ తీసుకుందని అంటున్నారు కోలీవుడ్ జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు