'నంది అవార్డు' పై స్పందించిన జ‌గ‌ప‌తి!

'నంది అవార్డు' పై స్పందించిన జ‌గ‌ప‌తి!

ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన హీరో జ‌గ‌ప‌తిబాబు....లెజెండ్ సినిమాతో త‌న సెకండ్ ఇన్నింగ్స్ ను స‌క్సెస్ ఫుల్ గా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రంలో విల‌న్ గా న‌టించిన జ‌గ‌ప‌తిబాబును నంది అవార్డు వ‌రించింది. ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను వల్లే తనకు నంది అవార్డు దక్కిందని జ‌గ‌ప‌తిబాబు అన్నారు. ప్రతినాయకుడి పాత్ర చేయ‌డానికి తాను భయపడినా, బోయపాటి ఎంక‌రేజ్ చేశార‌ని చెప్పారు. నంది అవార్డుకు త‌న‌ను ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా ఆయ‌న అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. 30ఏళ్లుగా త‌న‌ను భరిస్తున్న తెలుగు ప్రేక్ష‌కులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

తాను హీరోగా న‌టించిన‌ తొలి చిత్రం ‘సింహ స్వప్నం’ 3 రోజులు ఆడింద‌ని, విలన్‌గా చేసిన ‘లెజెండ్‌’ 3 సంవ‌త్స‌రాలు ఆడింద‌ని అన్నారు. దాంతోపాటు, ప్రభుత్వం, ప్రేక్షకుల నుంచి గుర్తింపు కూడా లభించింద‌న్నారు. ఇండ‌స్ట్రీలో పరిస్థితులు క్ష‌ణాల్లో మారిపోతుంటాయ‌ని జ‌గ‌ప‌తి అన్నారు. ఓ మంచి నటుడిని ద‌ర్శ‌కులు వెతికి పట్టుకున్న సంద‌ర్భాలూ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్నాయ‌ని త‌న స్వీయానుభ‌వాన్ని గుర్తు చేసుకున్నారు. చిత్ర పరిశ్రమకు రాక ముందే రామ్‌గోపాల్‌ వర్మ త‌న‌కు మంచి స్నేహిడ‌ని చెప్పారు. ఏదో ఒక సినిమాలో త‌న న‌ట‌న చూసి ‘గాయం’లో వర్మ పిలిచి మ‌రీ త‌నకు హీరోగా అవ‌కాశ‌మిచ్చాడ‌ని చెప్పారు. ఆ సినిమా త‌న‌కు చాలా గుర్తింపు తీసుకు వ‌చ్చింద‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు