నాగచైతన్యకి దక్కని స్టార్‌డమ్‌

నాగచైతన్యకి దక్కని స్టార్‌డమ్‌

అక్కినేని వంశానికి మూడో తరం ప్రతినిధి అయిన నాగచైతన్య అసలు ఈపాటికి సాలిడ్‌ హీరోగా సెటిల్‌ అయిపోయి ఉండాలి. అంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా కానీ చైతన్యకి మాత్రం ఎందుకో ల్యాండ్‌మార్క్‌ హిట్‌ దక్కడం లేదు.

మహేష్‌బాబుకి నాలుగో సినిమా మురారితో నటుడిగా విజయం దక్కింది. ఏడో సినిమా ఒక్కడుతో స్టార్‌డమ్‌ దక్కింది. జూనియర్‌ ఎన్టీఆర్‌కి రెండో సినిమా 'స్టూడెంట్‌ నంబర్‌వన్‌'తో విజయం దక్కగా, నాలుగో చిత్రం 'ఆది'తో స్టార్‌ అయిపోయాడు. రామ్‌ చరణ్‌కి రెండో సినిమా 'మగధీర'తోనే చారిత్రిక విజయం దక్కింది. ఇలా వారసులంతా చాలా వేగంగానే తమ ముద్ర వేసి హీరోలుగా నెక్స్‌ట్‌ లెవల్‌కి వెళ్లిపోయారు. కానీ చైతన్య మాత్రం ఇంకా ఆ స్టార్‌డమ్‌ కోసం పరితపిస్తూనే ఉన్నాడు.

తడాఖా ఫర్వాలేదనిపించినా కానీ ఇది చైతన్యకి హీరోగా రేంజ్‌ పెంచే సినిమా అయితే కాదనేది వాస్తవం. ఏదైనా ఒక సినిమా వస్తే ఇక ఆ దెబ్బతో సదరు హీరో తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు. నాగార్జునకి కూడా అలాంటి విజయం దక్కడానికి చాలా టైమ్‌ పట్టింది. శివతోనే అతను స్టార్‌ అయ్యాడు. అలాగే చైతన్యకి కూడా కాస్త ఆలస్యంగా స్టార్‌డమ్‌ వస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు