నాకేం కాలేదూ బాబోయ్ -మెగాస్టార్

నాకేం కాలేదూ బాబోయ్ -మెగాస్టార్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు యాక్సిడెంట్ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ హల్ చల్ చేసేస్తోంది. పలు మీడియా హౌస్‌ లు కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తున్నాయి. ఓ ఫిలిం ఈవెంట్ కోసం కోల్కతా వెళ్లారు అమితాబ్.

ఆ కార్యక్రమం కోసం తిరిగి వస్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారుకు వెనుక చక్రం ఊడిపోయిందని.. దీంతో బిగ్ బీకి యాక్సిడెంట్ జరిగిందని.. ఆయన తీవ్ర గాయాల పాలయ్యారనే న్యూస్ వచ్చింది. దాని వెనకే.. అమితాబ్ కు స్వల్ప గాయాలు అయ్యాయని.. వెనకే ప్రయాణిస్తున్న మంత్రి కారులో తిరిగి తన జర్నీ కంటిన్యూ చేశారన్నది ఈ వార్తల సారాంశం. అయితే.. తన యాక్సిడెంట్ వార్తలపై అమితాబ్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

తను క్షేమంగా ఉన్నానని చెప్పడమే కాదు.. అసలు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదని ఆయన చెప్పడం విశేషం. "నా కారుకు ప్రమాదం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజం ఏ మాత్రం లేదు. నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు. నేను సేఫ్ గా ఉన్నాను"అంటూ ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు ఊరట కలిగించే న్యూస్ చెప్పారు బిగ్ బీ.

థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ అంటూ ఆమీర్ ఖాన్ తో కలిసి చేస్తున్న మూవీతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్న అమితాబ్.. మరోవైపు టీవీ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి పనుల్లో తెగ బిజీగా ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు