మహేష్ కత్తిని గట్టిగా ఏసుకున్నాడే..

మహేష్ కత్తిని గట్టిగా ఏసుకున్నాడే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో గొడవ ద్వారా.. ‘బిగ్ బాస్’ షో ద్వారా బాగానే పాపులర్ అయ్యాడు క్రిటిక్ కమ్ ఫిలిం మేకర్ మహేష్ కత్తి. ఐతే ఎంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు తనతో మాటల దాడికి దిగినప్పటికీ తన వాక్చాతుర్యంతో, తన వాదనను గట్టిగా వినిపిస్తూ వారిపై పైచేయి సాధిస్తున్నట్లే కనిపించాడు మహేష్. కానీ ఇప్పుడతడికి సరైనోడు తగిలాడు.

కమెడియన్ హైపర్ ఆది.. మహేష్ కత్తిని ఓ టీవీ ఛానెల్ చర్చలో గట్టిగా తగులుకున్నాడు. ఏమాత్రం మొహమాటం లేకుండా మహేష్ మీద ఎదురు దాడి చేస్తూ.. అతడిని ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య వాదన ఎలా మొదలైందంటే..

ఈ మధ్య ‘జబర్దస్త్’ కామెడీ షోలో హైపర్ ఆది.. మహేష్ కత్తిని టార్గెట్ చేసుకుని పంచులు పేల్చుతున్నాడు. దీని మీద ఇటీవలే మహేష్ కత్తి స్పందిస్తూ ఫేస్ బుక్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో హైపర్ ఆదితో పాటు జబర్దస్త్ షో మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఐతే రెండు రోజులు గడవగానే ‘లండన్ బాబులు’ ప్రివ్యూ షో కోసం వెళ్లిన కత్తి అక్కడ ఆదితో కలిసి ఒక ఫొటో దిగాడు. దాన్ని మళ్లీ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేస్తూ.. తాము తాము బాగానే ఉంటామని, మధ్యలో వెధవలయ్యేది అభిమానులే అని పేర్కొన్నాడు. మరో ఫేస్ బుక్ పోస్టులో కత్తి పవన్ అభిమానుల్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మీరు మీ హీరోకు పొర్లుదండాలే పెడతారో.. అంగప్రదక్షిణలే చేస్తారో లేక అంగచూషణే చేస్తారో చేసుకోండి’’ అని పేర్కొన్నాడు.

దీనిపై హైపర్ ఆదికి మండిపోయింది. ఓ టీవీ ఛానెల్ చర్చలో భాగంగా ఫోన్ లైన్లోకి వచ్చిన కత్తిని వాయించేశాడు ఆది. తనతో దిగిన ఫొటోను ఇలా వాడుకుంటావని అనుకోలేదు.. అక్కడ ఫ్యాన్స్ పేరు పెట్టి తిట్టావు.. నేను కూడా పవన్ ఫ్యాన్‌నే.. అలా అంటే నన్ను కూడా తిట్టినట్లే.. అంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తావా.. ఇలా అభిమానుల్ని రెచ్చగొడితే నీతో ఇలాగే ప్రవర్తిస్తారు.. అభిమానుల్ని ఇలా తయారు చేస్తున్నది నువ్వే అంటూ గట్టిగా కత్తిని వాయించేశాడు ఆది. ఎప్పుడూ వాదనలో పైచేయి సాధించే కత్తి.. ఆదితో డిస్కషన్లో మాత్రం కొంచెం వెనుకబడ్డట్లే, తడబడ్డట్లే కనిపించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు