మణిరత్నం సినిమాలో ఎవరేంటి?

మణిరత్నం సినిమాలో ఎవరేంటి?

‘ఓకే బంగారం’ సినిమాతో ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు మణిరత్నం. కానీ ఆ ఫామ్‌ తాత్కాలికే అయింది. ఈ ఏడాది ‘చెలియా’తో పూర్వపు ఫామ్‌ను అందుకున్నాడు మణి. ఈ సినిమా చూశాక చాలామంది మణిరత్నం ఇక సినిమాలు చాలించేయాలని కూడా అన్నారు. ఐతే ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నించే మణి.. ప్రయత్నం ఆపట్లేదు.

ఒక భారీ కాంబినేషన్లో ప్రత్యేకమైన సినిమా తీయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన నటీనటుల వివరాల్ని ప్రకటించారు. ఇప్పుడు ఎవరు ఏ పాత్ర చేసేది కూడా వెల్లడించడం విశేషం.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ జంటగా నటించబోతున్నారు. వాళ్లు తల్లిదండ్రులుగా కనిపిస్తే.. అరవింద్ స్వామి, శింబు, ఫాహద్ ఫాజిల్ వారి కొడుకులుగా నటించనున్నారట. విలక్షణ నటులు విజయ్ సేతుపతి ఇందులో పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో కనిపిస్తాడట. జ్యోతిక, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ల పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ వివరాలు వెల్లడిస్తూ జనవరి నుంచి ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రానికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమానే మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందిస్తాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తాడు. మణిరత్నం స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English