సాయి పల్లవి చేతిలో అతని జాతకం

సాయి పల్లవి చేతిలో అతని జాతకం

సాయి పల్లవికి ఇప్పుడున్న క్రేజ్‌ ఏమిటనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మలయాళంలో మొదలు పెట్టి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోను పిచ్చ పాపులర్‌ అయిపోయింది. ఒకే సినిమాతో ఇంతగా ప్రాచుర్యం పొందిన సాయి పల్లవి ఇప్పుడు కేరళ దాటి తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా వుంది. నానితో చేసిన మిడిల్‌క్లాస్‌ అబ్బాయి త్వరలోనే విడుదల కానుండగా, శర్వానంద్‌తో మరో చిత్రంలో పని చేస్తోంది.

ఇదిలావుంటే యువ నటుడు నాగశౌర్యతో కణం అనే హారర్‌ చిత్రంలో సాయి పల్లవి నటిస్తోంది. ప్రస్తుతం కెరియర్‌ పరంగా పురోగతి లే కష్టాల్లో వున్న నాగశౌర్యకి ఈ చిత్రం చాలా కీలకం. ఇదే సినిమాతో అతను తమిళ చిత్ర పరిశ్రమకి కూడా పరిచయం అవుతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌ కనుక తమిళంలో కూడా ఈ చిత్రానికి తప్పక ఆదరణ వుంటుంది.

ప్రస్తుతం పిచ్చ క్రేజ్‌ నడుస్తోన్న హీరోయిన్‌... మిగతా హిట్‌ హీరోలని, బ్యాక్‌గ్రౌండ్‌ వున్న హీరోలని కాదని తన సినిమాలో నటించడం నాగశౌర్య లక్‌ అనే చెప్పాలి. మరి ఈ చిత్రంతో సాయి పల్లవి అతని జాతకాన్ని మార్చేసే విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు