నిజంగానే బన్నీకి దెబ్బేశారా??

నిజంగానే బన్నీకి దెబ్బేశారా??

తెలుగు సినిమాలకు సంబంధించి ఎన్నేసి అవార్డులు ఉన్నా.. నంది అవార్డులకు ఉన్న ప్రాముఖ్యత వేరు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే అవార్డులు కావడంతోనే వీటికి ప్రాధాన్యత ఉంటుంది. వీటిని అందుకోవడాన్ని ఓ ప్రతిష్టగా భావిస్తారు సినీ జనాలు. కానీ తాజాగా ప్రకటించిన నంది అవార్డుల విషయంలో అనేక వినిపిస్తున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగానే కొందరికి కావాలనే కట్టబెట్టారని.. మరికొందరిని అవమానించారనే కామెంట్స్ కు అయితే అంతే లేదు.

2015 సంవత్సరానికి సంబంధించిన అవార్డులలో రుద్రమదేవికి ప్రాధాన్యత లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పాలి. పైగా ఈ సినిమాలో నటించిన అల్లు అర్జున్ కు ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డ్ ప్రకటించారు. విచిత్రం ఏంటంటే.. అసలు అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రకు.. రుద్రమదేవి టీం అవార్డు అప్లై చేసిన మాట వాస్తవమే. కానీ సహాయ నటుడు కేటగిరీలో బన్నీ తరఫున దరఖాస్తును పంపారు. కానీ అప్లై చేసిన కేటగిరీలో కాకుండా.. మరో కేటగిరీలో అవార్డు ప్రకటించడం చిత్రమైన విషయం.

ఈ విషయాన్ని దరఖాస్తుతో పాటు ఇంటర్నెట్ లో పెట్టాడు గుణశేఖర్. ఈ దర్శక నిర్మాత సపోర్టింగ్ యాక్టర్ క్యాటగిరీలో ఎప్లయ్ చేస్తే.. అసలు క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎలా అవార్డును ఇచ్చారనే డౌట్.. ఇప్పుడు నెటిజన్స్ లో కూడా మొదలైంది. ఇప్పటివరకూ గోన గన్నారెడ్డి పాత్రకు గాను.. ఉత్తమ నటుడు.. ఉత్తమ సహాయనటుడు అవార్డులను అల్లు అర్జున్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. కానీ నందుల విషయానికి వచ్చేసరికి.. ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ప్రకటించడం.. ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు