ఈ ట్రిపుల్ యాక్షన్ టముకు ఉత్తిదేనా??

ఈ ట్రిపుల్ యాక్షన్ టముకు ఉత్తిదేనా??

రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చిన మాస్ మహారాజా ఇప్పుడు టచ్ చేసి చూడు సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఒక ప్రయోగాత్మకమైన పాత్రతో హిట్ అందుకోవడంతో.. రవితేజ నెక్ట్స్ కూడా అదే తరహాలో ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఇక నుంచి కథ పూర్తిగా కొత్తదనంతో ఉంటేనే ఒకే చేస్తానని చెబుతున్నాడట మాస్ మహరాజ్.

రీసెంట్ గా ఓ యువ దర్శకుడు చెప్పిన కొత్త పాయింట్ రవితేజ కి బాగా నచ్చిందని ఇప్పుడు రూమర్లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఆ కథలో మాస్ రాజా మూడు విభిన్న పాత్రల్లో అలరించనున్నాడట. ఒక బడా నిర్మాణ సంస్థ ఈ కథని సెట్స్ పైకి తీసుకువెళ్లాడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమర్ అక్బర్ ఆంటోని అనే టైటిల్ కూడా నిశ్చయించారట.

నిజానికి ఇక్కడ అస్సలు అర్ధంకాని విషయం ఏంటంటే.. శ్రీను వైట్ల డైరక్షన్లో చేయాల్సిన సినిమాను రెమ్యూనరేషన్ కోసం వదిలేసుకున్న రవితేజ.. 10 కోట్లు కావాలంటూ గోడ ఎక్కి కూర్చున్నాడు. అసలు మద్యలో ఇప్పుడు ఈ ట్రిపుల్ యాక్షన్ సినిమా ఎలా వచ్చింది? ఇదంతా చూస్తుంటే శ్రీను వైట్ల సినిమా తాలూకు న్యూస్ ను కవర్ చేయడానికి ఏదో ఉత్తుత్తినే క్రియేట్ చేసిన రూమర్ తరహాలో అనిపించట్లేదూ?

ప్రస్తుతం రవితేజ హైదరాబాద్ లో వేసిన ఒక సెట్ లో టచ్ చేసి చూడు షూటింగ్ చేస్తున్నాడు. ఒక సెట్ లో సాంగ్ ను చిత్రీకరణ జరుగుతోంది. నల్లమలుపు బుజ్జి - వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తున్నాడు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు