రాజేంద‌ర్ మాట‌ల‌కు వారం నిద్ర‌పోలేదు: ధ‌న్సిక‌

రాజేంద‌ర్ మాట‌ల‌కు వారం నిద్ర‌పోలేదు: ధ‌న్సిక‌

రెండు నెల‌ల క్రితం చెన్నైలో జ‌రిగిన‌ ‘విళితిరు'  సినిమా మీడియా సమావేశంలో ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత‌ టి.రాజేందర్ పేరును క‌బాలి ఫేం ధ‌న్షిక ప్ర‌స్తావించ‌ని ఘ‌ట‌న వివాదాస్పద‌మైన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాలో ధన్సిక హీరోయిన్ గా నటించ‌గా, టి.రాజేంద‌ర్ ఒక పాట పాడారు. అయితే, ధ‌న్సిక‌ ఆ సినిమా గురించి, అందులో పని చేసిన వారి గురించి ప్ర‌సంగించి పొర‌పాటున రాజేందర్ పేరు మరచిపోయింది.

దీంతో, ధ‌న్సిక‌ త‌న‌ను అవ‌మానించిన‌ట్లుగా భావించిన రాజేంద‌ర్ మీడియా ముందే ఆమెపై  ఆగ్రహంతో ఊగిపోయారు. తాను కావాల‌ని అలా చేయ‌లేద‌ని, పొర‌పాటున మ‌ర‌చిపోయాన‌ని క్ష‌మాప‌ణ‌లు చెప్పినా రాజేంద‌ర్ విన‌లేదు. రాజేంద‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌పై హీరో విశాల్ తో స‌హా ప‌లువురు త‌మిళ న‌టీన‌టులు మండిప‌డ్డారు. అయితే, తాజాగా, ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా ఆ ఘ‌ట‌న‌పై ధ‌న్సిక స్పందించారు.

తాను అందరి ముందు కన్నీరు పెట్టుకోవడానికి కారణమైన ఆ ఘటన గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాన‌ని చెప్పారు. అయితే, టీఆర్‌ (టి. రాజేందర్‌) ఆధ్యాత్మిక వ్యక్తని అందరూ అంటుంటార‌ని, కానీ ఆధ్యాత్మిక భావాలు ఉన్న వ్యక్తి అంద‌రి ముందు ఆ విధంగా కేక‌లు వేయ‌డ‌న్నారు. త‌న‌కూ ఆధ్యాత్మిక భావాలున్నాయ‌ని, అందువ‌ల్లే తాను చాలా ప్రశాంతంగా ఉంటాన‌ని చెప్పారు. గ‌తంలో త‌న‌కు కూడా కోపం ఎక్కువని, కానీ ఆధ్యాత్మికత త‌న‌లోని కోపాన్ని తగ్గించింద‌ని చెప్పారు. టీఆర్‌ వల్ల తాను మానసికంగా చాలా బాధపడ్డాన‌ని, ఆ ఘ‌ట‌న తాలూకు చేదు జ్ఞాప‌కాల నుంచి బయట ప‌డ‌డానికి వారం రోజులు పట్టింద‌న్నారు. రాజేంద‌ర్ మాట‌ల‌కు వారం నిద్ర‌పోలేదన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆ ఘ‌ట‌న‌పై తాను నిశ్శబ్దంగా ఉండిపోయాన‌ని, గతంలో కూడా తాను ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్నాన‌ని చెప్పారు. తానే కాకుండా, వివిధ రంగాల్లోని చాలా మంది మహిళలు ఇటువంటి సమస్యలు నిత్యం  ఎదుర్కొంటున్నారని, అలా అని తాను పురుషులను తప్పుపట్టడం లేద‌ని చెప్పారు. ధ‌న్సిక వ్యాఖ్య‌ల‌పై టి. రాజేంద‌ర్ ఏ విధంగా స్పందిస్తారో అన్న సంగ‌తి ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు