కెమిస్ట్రీ కుమ్మేసిన కేట్

కెమిస్ట్రీ కుమ్మేసిన కేట్

బాలీవుడ్ మూవీస్ లో సూపర్బ్ అనిపించే జంటల్లో సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ కూడా ఉంటారు. చివరగా ఏక్ థా టైగర్ లో అయితే.. వీరిద్దరూ కలిసి పండించిన కెమిస్ట్రీ అదిరిపోయింది. మాషాఅల్లా పాటలో అయితే.. ఇద్దరూ కలిసి ఇరగదీసేశారు.

మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ జంట కలిసి నటించిన చిత్రం టైగర్ జిందా హై. ఈ ఏఢాది ట్యూబ్ లైట్ తో డీలా పడ్డ సల్మాన్ ఖాన్.. టైగర్ జిందా హై మూవీతో మళ్లీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేయాలని చూస్తున్నాడు. డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ చిత్రం కోసం.. ఇప్పుడు ప్రచార కార్యక్రమాలు మొదలైపోయాయి. త్వరలోనే ఈ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేయబోతున్నరు. "స్వాగ్ సే కరేంగ్ సబ్ కా స్వాగత్" అంటూ సాగే పాటను విడుదల చేయనుండగా.. ఈ పాట కోసం సల్లూ భాయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేట్ అందాల మోత ఏ స్థాయిలో ఉంటుందో.. సల్మాన్ తో రొమాన్స్ ఏ స్థాయిలో పండించిందో అనే ఆసక్తి కనిపిస్తోంది.

'ఈ పాట కోసం ఫ్యాన్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలుసు. అందరి అంచనాలను అందుకునేలా ఈ పాటను చిత్రీకరించాం. సల్మాన్-కత్రినాల కెమిస్ట్రీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లొకేషన్స్.. స్టైలింగ్ కూడా ఆకట్టుకుంటాయి' అంటున్నాడు దర్శకుడు ఆలీ అబ్బాస్ జాఫర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English