మెహ్రీన్ సీన్స్.. లక్ కలిసి రాలేదనే

మెహ్రీన్ సీన్స్.. లక్ కలిసి రాలేదనే

కృష్ణగాడి వీర ప్రేమగాధతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ మెహ్రీన్ కౌర్ పీర్జాడా. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చినా.. రీసెంట్ గా రాజా ది గ్రేట్ తో మరో సక్సెస్ ను అందుకున్న ఈ భామకు ఇప్పుడు పెద్ద షాక్ తగిలేసింది.

 సందీప్ కిషన్ కు జోడీగా మెహ్రీన్ నటించిన మూవీ నెంజిల్ తునివిరుందాల్. తెలుగులో కేరాఫ్ సూర్య అనే టైటిల్ పై రిలీజ్ అయిన ఈ చిత్రం నుంచి.. ఇప్పుడు మెహ్రీన్ నటించిన సీన్స్ అన్నిటికీ కోత పెట్టేశారు. మూవీ స్పీడ్ పెంచడం కోసం.. ఇలా కత్తెర  వేయాల్సి వచ్చిందని దర్శకుడు సుశీంద్రన్ చెబుతున్నాడు. అయితే.. కట్ చేసిన వెర్షన్ చూస్తే.. పూర్తిగా మెహ్రీన్ పాత్రనే మూవీ నుంచి తీసేశారు. ఇలా ఒక గ్లామర్ భామకు సంబంధించిన రోల్ మొత్తం తీసేయడం అంటే విచిత్రమే. నిజానికి మెహ్రీన్ ఉంటే సినిమాకు గ్లామర్ యాడ్ అవుతుందని ఈమెను తీసుకున్నారట. కానీ మూవీకి ఈ భామ ప్లస్ కాకపోగా.. యాక్టింగ్ తో కూడా ఆకట్టుకోలేకపోయింది. పైగా స్క్రిప్ట్ లో ఉన్న గ్రిప్ ఈమె కేరక్టర్ అడ్డు తగులుతోందని భావించడంతో.. అసలు ఆమె రోల్ కి సంబంధించిన సీన్స్ అన్నీ తీసేశాడు అని టాక్ వినిపిస్తున్నారు.

కాని నిజానికి.. మెహ్రీన్ ను గోల్డెన్ లెగ్ అని భావించి.. ఆమె ప్రతీ సినిమాతోనూ అందరికీ హిట్ ఇస్తోంది కాబట్టి.. ఇప్పుడు సందీప్ కిషన్ కు కూడా వర్కవుట్ అవుతుందని భావిస్తే.. ఇక్కడ మాత్రం సీన్ రివర్సైంది. అందుకే ఈ లెగ్ ను తీసేస్తే ఏమవుతుందిలే అని కట్ చేశారట. అసలు ఒక్కసారి టాక్ తేడా వచ్చేశాక.. ఎవరుంటే ఏంటి ఎవరు లేకపోతే ఏంటి? కేరాఫ్‌ అస్సాం అంతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు