ఆ లెక్కలో మహేషే నెం 1

ఆ లెక్కలో మహేషే నెం 1

మహేష్ బాబు.. తన నటనతో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్కాడో తెలిసిన విషయమే. కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉంటాయనే విమర్శలు ఉన్నా.. సూపర్ స్టార్ నటనకు అందరూ ఫిదా అవాల్సిందే. అందుకే ప్రేక్షకుల మెప్పుతో పాటు అనేక అవార్డులు కూడా మహేష్ ను వరిస్తుంటాయి.

ఇక ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డులలో కూడా మహేష్ హవా కనిపిస్తుంది. తాజాగా శ్రీమంతుడు చిత్రానికి గాను 2015 ఏడాదికి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డును సొంతం చేసుకున్నాడు మహేష్. ఇది మహేష్ కెరీర్ లో ఎనిమిదో నంది అవార్డు కావడం విశేషం. ఇప్పుడు శ్రీమంతుడు చిత్రం కోసం ఉత్తమ నటుడిగా నాలుగోసారి నంది అవార్డు అందుకోనున్నాడు మన సూపర్ స్టార్. నిజం(2004).. అతడు(2006).. దూకుడు(2016) చిత్రాలకు గతంలో నంది ఉత్తమ నటుడు అవార్డు దక్కగా.. ఇప్పుడు శ్రీమంతుడు మరోసారి నందిని మహేష్ కు అందించాడు.

మహేష్ హీరోగా వచ్చిన మొదటి సినిమా రాజకుమారుడు చిత్రంతో తొలి నందిని అందుకున్న మహేష్.. ఆ తర్వాత మురారి(2002).. టక్కరి దొంగ(2005).. అర్జున్(2006) చిత్రాలకు స్పెషల్ జ్యూరీ అవార్డుల రూపంలో నందులను సొంతం చేసుకున్నాడు. తన సమకాలికుల్లో.. అష్ట నందులను అందుకున్న ఏకైక హీరో మహేష్.