లక్ష్మీపార్వతికి ఈ కెలుకుడు అవసరమా?

లక్ష్మీపార్వతికి ఈ కెలుకుడు అవసరమా?

కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే ఆయన ఎలాంటి సినిమాలు తీశాడో.. ఆయన స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే. ఓవైపు నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా అనౌన్స్ చేయడం.. అంతలో రామ్ గోపాల్ వర్మ కూడా మరో కోణంలో ఎన్టీఆర్ కథను చూపించడానికి తయారవ్వడంతో ఆ పోటీ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుండగానే ఈయన రంగంలోకి దిగిపోయాడు.

‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అంటూ సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా టైటిల్, దీని ప్రి లుక్ పోస్టర్ చూస్తేనే దీని స్థాయి ఏంటో జనాలకు అర్థమైంది. ఒక రకమైన చీప్ ఫీలింగ్ కలిగింది అందరికీ. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి పబ్లిసిటీ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు.

పబ్లిసిటీ కోసం రామ్ గోపాల్ వర్మ స్టయిల్‌ను అనుకరించే ప్రయత్నం చేస్తున్నాడతను. ఐతే వర్మ స్థాయి ఏంటి.. ఈయన స్థాయి ఏంటి అన్నది జనాలకు తెలుసు. పబ్లిసిటీ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు అభాసుపాలవుతున్నాయి. అసలీ సినిమాను ఎవరైనా సీరియస్‌గా తీసుకుంటున్నారా అన్నది సందేహమే. కానీ లక్ష్మీపార్వతి ఆయన్ని ఇగ్నోర్ చేయడం మాని.. పదే పదే ఆ సినిమా గురించి స్పందించడం ద్వారా దానికి మంచి పబ్లిసిటీ తెచ్చి పెట్టే ప్రయత్నం చేస్తోంది.

ఇప్పటికే రెండు మూడు సార్లు ఈ సినిమా గురించి స్పందించిన ఆమె.. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ కేతిరెడ్డి అండ్ కోను ఇష్టానుసారం తిట్టిపోసింది. ఆమె తీరు ఉలికిపాటు లాగా ఉంది. దీని వల్ల ఆమె ఈ సినిమా విషయంలో చాలా భయపడిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె సైలెంటుగా ఉంటూ, దీన్ని ఇగ్నోర్ చేస్తే జనాలు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ లక్ష్మీపార్వతి అతిగా స్పందిస్తూ.. ఆ సినిమాకు పబ్లిసిటీ తెచ్చిపెడుతూ.. జనాలకు కూడా అంతగా ఆ సినిమాలో ఏముంటుందో చూద్దామని క్యూరియాసిటీ తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు