న‌య‌న్ న‌ట‌న‌కు త‌లైవా ఫిదా!

న‌య‌న్ న‌ట‌న‌కు త‌లైవా ఫిదా!

న‌య‌న‌తార హీరోయిన్ గా నటించిన సందేశాత్మ‌క చిత్రం ‘అరాం’ సూప‌ర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ ఫుల్ ఐఏఎస్ పాత్ర‌లో న‌య‌న్ ప‌ర్ ఫార్మ‌న్స్ కు త‌మిళ ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. `లేడీ సూప‌ర్ స్టార్` న‌య‌న‌తార‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా ఈ లేడీ సూప‌ర్ స్టార్ పై త‌మిళ సూప‌ర్ స్టార్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆ చిత్రంలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ కలెక్ట‌ర్ పాత్ర‌లో న‌య‌న‌తార అద్భుతంగా న‌టించింద‌ని త‌లైవా ప్ర‌శంసించారు. ఈ సినిమా తన హృదయానికి చాలా దగ్గరైందన్నారు. ఇంత మంచి ప్ర‌య‌త్నం చేసిన చిత్ర బృందానికి రజనీ శుభాకాంక్షలు చెప్పారు. త‌లైవా కోసం ఈ సినిమా ప్ర‌త్యేక స్క్కీనింగ్ ను సోమ‌వారం ఏర్పాటు చేశారు. ఆ షో అనంత‌రం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ర‌జ‌నీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

గోపీ నైనర్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ లేడీ ఓరియంటెడ్ మూవీలో న‌య‌న్ ప్ర‌ద‌ర్శ‌న‌కు విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ గ్రామ ప్రజల సమస్యలను ఆ జిల్లా క‌లెక్ట‌ర్ ఏ విధంగా ప‌రిష్క‌రించింద‌న్న నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.  ‘అరాం’ యూనిట్ ను హీరోయిన్ అమలాపాల్  ప్ర‌శంసించింది. ఆ చిత్ర యూనిట్ కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేసింది. స్టార్‌ హీరోల మసాలా సినిమాలే కాకుండా, మంచి కథ, నటన, సందేశం ఉన్న సినిమాలకు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉంటుంద‌ని ఈ సినిమా నిరూపించిందని ట్వీట్ చేసింది. నయనతార, దర్శకుడు గోపీ నైనర్ కు సెల్యూట్  చెప్పింది. ర‌జ‌నీకాంత్ ప్రశంస తమ యూనిట్‌కు ప్రోత్సాహ‌మిచ్చిందని చిత్ర దర్శక, నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాటలు మరింత కష్టపడి పనిచేసే స్ఫూర్తినిచ్చాయన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English