ఇప్పుడు దీపిక బట్టలు కొనుక్కోండి

ఇప్పుడు దీపిక బట్టలు కొనుక్కోండి

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఇప్పుడు పద్మావతి మూవీ రిలీజ్ కోసం తెగ ఎదురుచూస్తోంది. ఈ మూవీలో రణవీర్ సింగ్.. షాహిద్ కపూర్ లు కూడా నటించినా.. అందరి దృష్టీ దీపికా పైనే ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం గుళ్లు గోపురాలు పట్టుకుని తెగ తిరుగుతున్న దీపిక.. అప్పుడు కొత్తగా సొంత వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టేసింది.

"ఆల్ అబౌట్ యు" అంటూ ఓ కొత్త క్లోతింగ్ బ్రాండ్ ను స్టార్ట్ చేసింది దీపికా పదుకొనే. ఈ కామర్స్ పోర్టల్ మింత్రా తో కలిసి ఈ బ్రాండ్ ను లాంఛ్ చేసిన దీపిక.. ఆ బ్రాండ్ డ్రెస్సులు వేసుకుని తెగ పోజులు ఇచ్చేసి.. ఫోటోలు దిగేసింది. తన సొంత బ్రాండ్ కోసం.. దీపిక తనే బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తగా.. ఇప్పటికే ఇదే తరహా వ్యాపారాన్ని పలువురు బాలీవుడ్ స్టార్స్ నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ అనుష్క శర్మ NUSH అనే బ్రాండ్ ను స్టార్ట్ చేయగా.. సోనమ్ కపూర్ కు చెల్లెలు రియాతో కలిపి RHESON అనే ఓన్ బ్రాండ్ ఉంది.

అందాల భామలు మాత్రమే కాదు.. హీరోలు.. క్రికెటర్లు కూడా ఇలా సొంత బ్రాండ్స్ ను డెవలప్ చేసుకుంటున్నారు. హృతిక్ రోషన్ కు HRX అనే సొంత బ్రాండ్ ఉంది. దీనిపై ఎలక్ట్రానిక్స్ నుంచి అనేక ప్రొడక్ట్స్ కు కోబ్రాండింగ్ కూడా చేస్తుంటాడు. మరోవైపు.. టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 'WROGN'అనే సొంత బ్రాండ్ ఉంది. తమ స్టార్  స్టేటస్ ను సెలబ్రిటీలు వ్యాపారానికి భలే ఉపయోగించుకుంటున్నారు కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English