కూతుర్ని పక్కనపెట్టిన పూరి?

కూతుర్ని పక్కనపెట్టిన పూరి?

దర్శకుడు పూరీ జగన్నాధ్ ఎంత స్పీడ్ గా వర్క్ చేస్తాడో తెలిసిన విషయమే. ఒక్క స్పీడ్ మాత్రమే కాదు.. అందులో క్వాలిటీ కంటెంట్ కూడా ఉండడమే ఆశ్చర్యం కలిగించే విషయం. పైగా ఇంత బడ్జెట్ అని ముందుగా అనుకుని.. చెప్పిన బడ్జెట్లోనే మూవీ పూర్తి చేయడం పూరీ ప్రత్యేకతల్లో ఒకటి.

ఈ మధ్య కొంతకాలంగా ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నా.. ఇప్పుడు మెహబూబా అంటూ తన కొడుకు ఆకాష్ పూరీని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ను హిమాచల్ మరియు పంజాబ్ లో చకచకా ఫినిష్ చేస్తున్నారు. అయితే.. ఈ షూట్స్ కు తన కూతురును పూరీ జగన్నాధ్ తీసుకువెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాలకృష్ణతో తెరకెక్కించిన పైసా వసూల్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది పూరీ డాటర్ పవిత్ర. టీంతో కలిసి పోర్చుగల్ లో జరిగిన లాంగ్ షెడ్యూల్ లో కూడా పాల్గొంది. అయితే.. ఇప్పుడు ఆమె తన సోదరుడు హీరోగా రూపొందుతున్న మెహబూబా షూటింగ్ లో మాత్రం ఈమె కనిపించడం లేదు.

ప్రస్తుతం పవిత్ర తన స్టడీస్ తో ఫుల్ బిజీగా ఉందని.. ఆమె చదువులను డిస్టర్బ్ చేసే ఉద్దేశ్యం పూరీకి లేదని.. అందుకే మెహబూబాకు ఆమె వర్క్ చేయడం లేదని కొందరు అంటున్నారు. మరి కొందరు మాత్రం.. సొంత బ్రదర్ నటించే రొమాంటిక్ మూవీ కావడంతోనే.. ఆమెను దూరంగా ఉంచారనే టాక్ కూడా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English