హలో.. పోస్టర్ ఇరగదీశారు

హలో.. పోస్టర్ ఇరగదీశారు

అఖిల్ రెండో సినిమా కోసం అక్కినేని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి చిత్రం డిజాస్టర్ తర్వాత.. లాంగ్ గ్యాప్ తీసుకుని విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేసిన అఖిల్.. ఫుల్ స్పీడ్ లోనే మూవీని కంప్లీట్ చేసేస్తున్నాడు.

హలో మూవీని డిసెంబర్ 22న విడుదల చేస్తుండగా.. ఇప్పుడు ప్రచార కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించారు. ఇవాళ చిన్న సర్ ప్రైజ్ ఇస్తామంటూ ముందే హింట్ ఇచ్చిన అఖిల్.. ఇప్పుడు టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్ ను ఇచ్చాడు. నవంబర్ 16న టీజర్ విడుదల చేయనున్నట్లు.. ఈ పోస్టర్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. సెల్ ఫోన్లను బేస్ చేసుకుని డిజైన్ చేసిన ఈ పోస్టర్ ను చూస్తే.. ఓ ట్రైన్ కంపార్ట్ మెంట్ పై నుంచి అఖిల్ జంప్ చేస్తున్నట్లుగా అనిపించేలా ఉండడం విశేషం. అటు బ్రాండింగ్ ను కూడా పోస్టర్ లోనే పరిచయం చేసేసినా.. చూడగానే వావ్ అనిపించేయడం.. హలో టీజర్ పోస్టర్ స్పెషాలిటీ.

ఇక వెను తిరిగి చూసే సమస్యే లేదంటూ అఖిల్ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. మరోవైపు.. 'మేం చాలా నవ్వాం. చాలానే ఏడ్చాం. ఇప్పుడు హలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసేస్తున్నాం' అంటూ అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ అయితే.. ఫ్యాన్స్ లో తెగ ఉత్సాహం పెంచేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English