ఇద్దరు యంగ్ డైరెక్టర్లూ తూచ్ అనేశారు

ఇద్దరు యంగ్ డైరెక్టర్లూ తూచ్ అనేశారు

సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక సినిమాల గురించి గాసిప్స్, రూమర్స్ బాగా పెరిగిపోయాయి. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. సమాచారం డంప్ అయిపోతోంది. దీంతో ఏది వాస్తవమో ఏది అబద్ధమో తెలియని అయోమయం నెలకొంటోంది.

ముఖ్యంగా కొత్త సినిమాలు.. కాంబినేషన్ల గురించి రకరకాల ఊహాగానాలు నడుస్తుంటాయి సోషల్ మీడియాలో. ఈ మధ్య అలాంటి వార్తలు బాగా ఎక్కువైపోయాయి. వీటిలో ఏవి నిజాలో తెలియక జనాలు గందరగోళానికి గురవుతున్నారు. ఓ కాంబినేషన్ గురించి ఒక వార్త బయటికి రావడం.. అది అబద్ధమంటూ ప్రకటనలు రావడం మామూలైపోయింది. తాజాగా అలాంటి వార్తలు అబద్ధమని తేలాయి.

‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి.. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ చేయబోతున్నట్లుగా కొన్ని రోజులుగా గట్టి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే తాను మల్టీస్టారర్ చేయాలని చూస్తున్న మాట వాస్తవమే అని.. కానీ ఇప్పటిదాకా ఎవరికీ కథ చెప్పలేదని, సినిమా కన్ఫమ్ అయినపుడు తానే చెబుతానని, అంత వరకు ఊహాగానాలు కట్టిపెట్టాలని అనిల్ కోరాడు.

మరోవైపు ‘నిన్ను కోరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ.. మెగా కుర్రాడు వరుణ్ తేజ్‌తో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ దర్శకుడు కూడా ఈ ప్రచారాన్ని ఖండించాడు. తన రెండో సినిమా హీరో ఎవరో ఇంకా కన్ఫమ్ కాలేదని, అది తేలాక తానే ప్రకటన చేస్తానని అతనన్నాడు. మరి ఈ యంగ్ డైరెక్టర్లు.. తమ తర్వాతి సినిమాల్ని ఎవరితో తీయనున్నారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు