న‌వ్వాం.. ఏడ్చాం.. ఇప్పుడేమో..

న‌వ్వాం.. ఏడ్చాం.. ఇప్పుడేమో..

అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆ మ‌ధ్య‌న విడుద‌లైన బంప‌ర్ హిట్ సాధించిన మ‌నం సినిమా సెట్టింగ్ కాలిపోయింది. తండ్రి గుర్తుగా ఎంతో జాగ్ర‌త్త‌గా దాచుకున్న సెట్టింగ్ క‌ళ్ల ముందు అగ్నికి ఆహుతి అయిపోతుంటే చూస్తూ ఉండిపోయారు నాగ్‌. అంత బాధ‌లోనే తాను సంతోషించిన విష‌యాన్ని వెల్ల‌డించాడు.

సెంటిమెంట్ గా ఫీల‌య్యే సెట్ త‌గ‌ల‌బ‌డ‌టం బాధ క‌లిగించినా.. ఫైర్ యాక్సిడెంట్ తో ఎవ‌రికి ఏం కాక‌పోవ‌టం హ్యాపీగా ఉందంటూ తానెంత ప్రాక్టిక‌ల్ మ‌నిషో చెప్పేశారు. ఫైర్ యాక్సిడెంట్ జ‌రిగిన ప‌న్నెండు గంట‌ల్లోనే సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు నాగ్‌.

గ‌డిచిన వార‌మంతా ఎంతో భావోద్వేగంతో గ‌డిచిపోయింద‌న్న ఆయ‌న‌.. హ‌లో హై ఫ్రెండ్స్ .. వార‌మంతా భావోద్వేగంతో సాగిపోయింది. ఏడ్చాం.. న‌వ్వాం.. ఇప్పుడు హ‌లో మూవీ ప్ర‌చార కార్య‌క్ర‌మానికి సిద్ధ‌మ‌వుతున్నామ‌న్నాడు. ఈ రోజు (మంగ‌ళ‌వారం) మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల నుంచి ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని షురూ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఫైర్ యాక్సిడెంట్ లో రెండు కోట్ల విలువైన సెట్ ద‌గ్థ‌మైన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. స్టూడియోలో జ‌రిగిన ఫైర్ యాక్సిడెంట్ తో షాక్‌కు గురైనా.. అందులోనే మునిగిపోలేద‌న్న సంకేతాన్ని ఇచ్చేలా నాగ్ ట్వీట్ ఉంద‌ని చెప్పాలి. సంతోషం కానీ బాధ కానీ అందులోనే మునిగిపోకుండా.. అక్క‌డితో ఆగిపోకుండా.. త‌ర్వాత అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఇది నాగ్ నేర్పిన పాఠమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English