మూడు కోట్లు కొల్లగొట్టేసిన గరుడవేగ

మూడు కోట్లు కొల్లగొట్టేసిన గరుడవేగ

పది రోజుల కిందట రిలీజైన సీనియర్ రాజశేఖర్ రీఎంట్రీ మూవీ ‘గరుడవేగ’కు చాలా మంచి టాక్ వచ్చింది. కానీ ఆ టాక్‌కు తగ్గట్లుగా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మాత్రం రాలేదు. రెండో వారాంతం ముగిసేసరికి కూడా ఆ చిత్రం రూ.6 కోట్లకు అటు ఇటుగా షేర్ వసూలు చేసిందంతే. రూ.25-30 కోట్ల మధ్య పెట్టుబడి పెట్టిన సినిమాకు మంచి టాక్ వచ్చి కూడా ఇంత తక్కువ వసూళ్లు రావడం నిరాశ కలిగించే విషయమే.

ప్రి రిలీజ్ బజ్ లేకపోవడం వల్ల కావచ్చు.. రాజశేఖర్ మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఉండటం వల్ల కావచ్చు.. ఆశించిన సంఖ్యలో, మంచి థియేటర్లు ఇవ్వకపోవడం వల్ల కావచ్చు.. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మాత్రం ఆశాజనకగా లేవు.

కానీ అమెరికాలో మాత్రం ఈ సినిమా అంచనాల్ని మించి పెర్ఫామెన్ చేసింది. అక్కడి బయ్యర్ రూ.32 లక్షల పెట్టుబడి పెట్టాడు ‘గరుడవేగ’పై. ఐతే ఈ సినిమా ఇప్పటిదాకా 4.5 లక్షల డాలర్లు (దాదాపు రూ.3 కోట్లు) వసూలు చేసి, బయ్యర్‌కు మంచి లాభాలు అందించడం విశేషం. దీని కంటే ముందు విడుదలైన ‘రాజు గారి గది’.. ‘రాజా ది గ్రేట్’.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ లాంటి క్రేజ్ ఉన్న సినిమాల కంటే కూడా ‘గరుడవేగ’ వసూళ్లు ఎక్కువగా ఉండటం విశేషం.

తొలి వారాంతంలోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు వచ్చేసింది. గత వారాంతంలో వచ్చిన సినిమాలేవీ యుఎస్‌లో ఎలాంటి ప్రభావం చూపలేదు. దీంతో ‘గరుడవేగ’నే అక్కడ బాక్సాఫీస్ లీడర్ అయింది. ఈ రోజో రేపో ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్కును కూడా దాటేయనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English