అసలు రేణు దేశాయ్‌కి పవన్ ఏమిచ్చాడు?

అసలు రేణు దేశాయ్‌కి పవన్ ఏమిచ్చాడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక భరణం కింద రేణు దేశాయ్ చాలా పెద్ద మొత్తంలో డబ్బు, ఆస్తులు తీసుకుందని.. మెయింటైనెన్స్ కింద కూడా ఆమెకు భారీ మొత్తంలో అందుతోందని ఒక ప్రచారం ఉంది ఇండస్ట్రీలో. దీని గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తే ఆశ్చర్యపోయింది రేణు. ఇదంతా ఉత్త ప్రచారమే అని ఆమె స్పష్టం చేసింది.

తాను పవన్ నుంచి అసలు భరణమే ఆశించలేదని ఆమె చెప్పింది. మెయింటైనెన్స్ కూడా తీసుకోవట్లేదని.. తన డబ్బులతోనే పిల్లల బాగోగులు చూస్తున్నానని ఆమె వెల్లడించింది. పవన్ నుంచి తాను తీసుకున్నది ఒక్క ఇల్లు మాత్రమే అని.. దాన్ని కూడా అమ్మేసి పిల్లల చదువుల కోసం ఇన్వెస్ట్ చేసి పెట్టానని ఆమె వెల్లడించింది.

‘‘మేమిద్దరం విడిపోయాక నేను మెయింటైనెన్స్ కూడా కోరుకోలేదు. అప్పుడు పవన్ నాతో మాట్లాడాడు. మెయింటైనెన్స్ వద్దంటున్నావు.. పిల్లల్ని పెంచుతున్నావు.. తండ్రి ఆస్తి మీద వాళ్లు హక్కుల ఉంటుంది కాబట్టి ఇల్లు తీసుకో అన్నారు. దాన్ని తీసుకుని అమ్మేసి ఆ డబ్బులు తీసి ఇన్వెస్ట్ చేశాను. వాళ్ల చదువులకు ఇబ్బంది రాకూడదనే అలా చేశాను. ఇక మిగతా ఖర్చులన్నీ నేనే చూసుకుంటున్నా. నేను 16 ఏళ్ల నుంచే డబ్బులు సంపాదిస్తున్నా. సినిమా రంగం నుంచి సంపాదించింది అంతా రకరకాలుగా ఇన్వెస్ట్ చేశాను. అదంతా నా కష్టార్జితమే. ఐతే నేనేదో పవన్ నుంచి చాలా డబ్బులు తీసుకున్నట్లు.. డబ్బుల కోసమే ఆయన నుంచి విడిపోయినట్లు కూడా ప్రచారం చేశారు. దీని గురించి అక్కడా ఇక్కడా చదివి మా దగ్గరి బంధువు ఒకాయన ఫారిన్ నుంచి ఫోన్ చేశాడు. నువ్వు ఇలాంటి డబ్బు మనిషివి అనుకోలేదు అన్నాడు. నాకు మతిపోయింది. మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా అని అడిగాను. అసలు విషయం చెప్పాను. నేను అంత దుర్మార్గురాలిని కాను’’ అని రేణు చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English