నయనతార రేంజ్ ఇదీ...

నయనతార రేంజ్ ఇదీ...

నయనతార.. ది లేడీ సూపర్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో వాయించేస్తున్నారు తమిళ జనాలు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘అరామ్’ సినిమా గత శుక్రవారం రిలీజైన దగ్గర్నుంచే ఇదే వరస. ఇటు విమర్శకులు.. అటు సినిమా వాళ్లు.. మరోవైపు ప్రేక్షకులు.. ఇలా ఎవ్వరు చూసినా నయన్ మీద ప్రశంసల జల్లు కురిపించేస్తున్నారు. ఈ సినిమాపై అన్ని వైపుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇండియాలో వచ్చిన బెస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో దీన్ని ఒకటిగా చెబుతున్నారు. అంతే కాదు.. ఈ ఏడాది బెస్ట్ మూవీ కూడా ఇదే అంటున్నారు.

టాప్ వెబ్ సైట్లన్నీ ఈ సినిమాకు మంచి రేటింగ్స్‌తో రివ్యూలు ఇచ్చాయి. ఒక సామాజిక సమస్య నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా ఈ సినిమాను తీర్చదిద్దాడట దర్శకుడు గోపీ నైనార్. ఇక నయనతార పెర్ఫామెన్స్ గురించైతే జనాలు మామూలుగా చెప్పట్లేదు. ఇలాంటి స్క్రీన్ ప్రెజెన్స్.. ఇలాంటి పెర్ఫామెన్స్ ఇంకే హీరోయిన్‌కూ సాధ్యం కాదంటున్నారు. ఒక స్టార్ హీరో సినిమా చూస్తున్నట్లుగా నయన్ పెర్ఫామెన్స్‌కు ప్రేక్షకుల నుంచి విజిల్స్, క్లాప్స్ పడుతున్నాయట.

ఈ సినిమా వసూళ్లు కూడా అనూహ్యంగా ఉన్నాయి. చెన్నై బాక్సాఫీస్‌ను మూడు వారాలుగా డామినేట్ చేస్తున్న విజయ్ సినిమా ‘మెర్శల్’ను ‘అరామ్’ వెనక్కి నెట్టేసింది. ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా ఆ ఒక్క సిటీలోనే రూ.1.2 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు చెన్నై బాక్సాఫీస్‌లో అగ్ర స్థానంలో ఉన్నది ‘అరామ్’ సినిమానే. మొత్తానికి ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు చూసి నయనతారా మజాకానా అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ చిత్రం ‘కర్తవ్యం’ పేరుతో తెలుగులోకి అనువాదమవుతోంది. త్వరలోనే విడుదల చేయాలని చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు