కూతురు అలా అడగ్గానే పవన్ వెళ్లిపోతాడట

 కూతురు అలా అడగ్గానే పవన్ వెళ్లిపోతాడట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల గురించి మాట్లాడటమే తక్కువ. ఇక తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పేదేముంది? ఐతే సెలబ్రెటీలకు సంబంధించి ఏ విషయాలైనా దాచేకొద్దీ ఆసక్తి పెరిగిపోతుంది జనాల్లో. అందులోనూ పవన్ లాంటి సూపర్ స్టార్, అంతర్ముఖుడి వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది.

పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాల గురించి ఆసక్తికర ముచ్చట్లు చెప్పింది. తన కూతురు ఆద్యతో పవన్ బంధం గురించి ఆమె చెప్పిన విశేషాలు భలే ఆసక్తి రేకెత్తించేవే. పవన్ కళ్యాణ్‌ను ఏ విషయమైన క్వశ్చన్ చేయగలిగే ఏకైక వ్యక్తి ఆద్యనే అని రేణు చెప్పడం విశేషం.

ఇద్దరు పిల్లల్లో పవన్‌కు అకీరాతో ఎమోషనల్‌ అటాచ్‌మెంట్‌ ఎక్కువ. ఆద్య తనతో ఎప్పుడూ డిమాండింగ్‌గా ఉంటుంది. కల్యాణ్‌ గారిని ఏ విషయమైన ప్రశ్నించగలిగేది తను ఒక్కత్తే అని నేను అంటుంటాను. అప్పుడప్పుడూ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ‘నాన్నా.. నువ్వెందుకు అంత బిజీగా ఉంటావు. ఐ మిస్‌ యు కదా. నువ్వు రేపు పుణెకు రా’ అని అంటుంది. ‘వారం టైం ఇవ్వు. షెడ్యూల్‌ చూసుకుని వస్తాను’ అని పవన్ చెబుతాడు. ఒక రోజు వచ్చి పిల్లల్ని కలిసి వెళ్లిపోతాడు. ఇక్కడికి వచ్చినపుడు పవన్ మరాఠీలో, ఇంగ్లిష్‌లో మాట్లాడతాడు. కళ్యాణ్ గారు ఒక ఏడాదిలో మరాఠీ నేర్చుకున్నారు. అకీరాకు తెలుగు అర్థమవుతుంది కాబట్టి ఆ భాషలోనే మాట్లాడతారు. పవన్, అకీరా ఎక్కువగా జీవితం గురించి మాట్లాడతారు. ఫిలాసఫీ గురించి కూడా చర్చ ఉంటుంది. వాళ్లిద్దరూ సినిమాల గురించి మాట్లాడుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు’’ అని రేణు చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English