శ్రీకాంత్ అడ్డాల రీఎంట్రీ?

 శ్రీకాంత్ అడ్డాల రీఎంట్రీ?

ఒక సినిమాకు నెగెటివ్ రిజల్ట్ వస్తే అది ఒక దర్శకుడి కెరీర్‌ను ఎలా మార్చేయగలదో గతంలో చాలా రుజువులే ఉన్నాయి. ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఫలితం శ్రీకాంత్ అడ్డాల కెరీర్‌ను కూడా అలాగే దెబ్బ కొట్టింది. ఈ సినిమా విడుదలై ఏడాదిన్నర అవుతున్నా అడ్డాలకు ఇంకో ఛాన్స్ రాలేదు. అతను ఇండస్ట్రీలో ఉున్న విషయమే తెలియట్లేదసలు. ఈ ఏడాదిన్నరలో అతను వార్తల్లోనే లేడు.

ఇప్పుడు అందరూ మరిచిపోయిన సమయంలో శ్రీకాంత్.. నాగచైతన్య-సమంతల వెడ్డింగ్ రిసెప్షన్లో కనిపించి అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించాడు. శ్రీకాంత్ మామూలుగా ఇలాంటి వేడుకలకు హాజరు కాడు. ఐతే మళ్లీ ఓ సినిమాకు రెడీ అవుతున్న నేపథ్యంలోనే అతను ఈ వేడుకకు వచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ శ్రీకాంత్‌కు ఛాన్స్ ఇవ్వబోతున్నట్లుగా హాట్ డిస్కషన్ నడుస్తోంది టాలీవుడ్లో. ఇదే వాస్తవమైతే ఆశ్చర్యపోవాల్సిందే.

గత కొన్నేళ్లలో ‘బ్రహ్మోత్సవం’ స్థాయిలో నెగెటివ్ టాక్ తెచ్చుకుని, అంత భారీ నష్టాలు తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు. దీంతో ఇప్పుడిప్పుడే ఏ పెద్ద నిర్మాతా.. పెద్ద హీరో అడ్డాలకు ఛాన్సివ్వడనే అనుకున్నారంతా. కానీ ఆచితూచి సినిమాలు చేసే అల్లు అరవింద్ అతడికి ఛాన్సిస్తున్నాడంటే ఆశ్చర్యకరమైన విషయమే. మరి అడ్డాలతో అరవింద్ ఏదైనా చిన్న సినిమా తీస్తాడా లేక తన ఫ్యామిలీ స్టార్లను పెట్టి పెద్ద సినిమానే నిర్మిస్తాడా.. చూద్దాం మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English