మెహ్రీన్‌కు ‘కేరాఫ్ సూర్య’ టీం షాక్

మెహ్రీన్‌కు ‘కేరాఫ్ సూర్య’ టీం షాక్

‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో హిట్టు కొట్టాక ఏడాదిన్నరకు పైగా విరామం తీసుకున్న మెహ్రీన్ కౌర్.. నెల వ్యవధిలో ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో పలకరించి హ్యాట్రిక్ హిట్లు పూర్తి చేసింది. సందీప్ కిషన్ సరసన నటించిన ‘కేరాఫ్ సూర్య’ సినిమాతో ఆమె డబుల్ హ్యాట్రిక్‌కు శ్రీకారం చుడుతుందని భావించారు.

కానీ ఈ సినిమాకు ఆశించిన స్పందన కనిపించడం లేదు. తెలుగులో ఈ చిత్రానికి ఓ మోస్తరుగా రివ్యూలు వచ్చాయి. కలెక్షన్లు మాత్రం చాలా నామమాత్రంగా ఉన్నాయి. ఫైనల్‌గా ఈ సినిమా తెలుగులో అయితే మంచి ఫలితాన్నందుకునేలా లేదు. ఐతే ఈ చిత్ర తమిళ వెర్షన్‌కు రెస్పాన్స్ బాగానే ఉంది.

‘కేరాఫ్ సూర్య’ తమిళ వెర్షన్‌కు పాజిటివ్ రివ్యూలే వచ్చినప్పటికీ.. చాలామంది హీరోయిన్‌తో ముడిపడ్డ సన్నివేశాల విషయంలో నెగెటివ్‌ కామెంట్సే చేశారు. ప్రేక్షకుల నుంచి కూడా అలాంటి ఫీడ్ బ్యాకే వచ్చింది. దీంతో తమిళ వెర్షన్ విషయంలో దర్శకుడు సుశీంద్రన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ చిత్రంలో మెహ్రీన్ పార్ట్ నుంచి 20 నిమిషాల మేర సన్నివేశాలకు కోత పెట్టేశాడట అతను. ఈ సన్నివేశాలు తొలగించాక చిత్ర నిడివి 1 గంట 50 నిమిషాలకు పరిమితమైంది.

దీంతో ఇప్పుడిది క్రిస్ప్ థ్రిల్లర్ లాగా తయారైందట. ఎడిటెడ్ వెర్షన్ ఆల్రెడీ థియేటర్లకు కూడా వెళ్లిపోయింది. తన సన్నివేశాలు తొలగిస్తున్న విషయాన్ని మెహ్రీన్‌కు సుశీంద్రన్ తెలియజేసి సారీ చెప్పాడట. ఐతే ఈ సినిమాతో తమిళంలోనూ పాగా వేద్దామని చూసిన మెహ్రీన్ నిరాశకు గురైనట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు